Begin typing your search above and press return to search.
ఇలాంటి సినిమాలు తీస్తే సెకండ్ షో వరకూ కష్టమే..!
By: Tupaki Desk | 3 Sep 2022 3:56 AM GMT'పిట్టగోడ' అనే ప్లాప్ మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అనుదీప్ కేవీ.. 'జాతిరత్నాలు' సినిమాతో ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా 'ప్రిన్స్' అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే దీని కంటే ముందుగా ఇప్పుడు 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
'ఫస్ట్ డే ఫస్ట్ షో' చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించలేదు కానీ.. కథ - మాటలు అందించారు. తన శిష్యులు వంశీధర్ - లక్ష్మీ నారాయణలకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి.. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత భుజాన వేసుకున్నాడు అనుదీప్. ఈ సినిమా అతని పేరు మీదుగానే ప్రమోట్ చేయబడింది.. మార్కెట్ చేయబడింది.
స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా ప్రమోషన్ల హడావిడి చేసి జనాల దృష్టిని ఆకర్షించడానికి 'జాతిరత్నాలు' డైరెక్టర్ అనే అంశం ప్రధాన కారణంగా చెప్పాలి. ఏడిద నాగేశ్వరరావు మనవరాలు నిర్మించిన సినిమా కావడంతో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనవంతు సపోర్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా హాజరై సినిమాకు కావాల్సినంత బజ్ తెచ్చిపెట్టారు. అయితే ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
శ్రీకాంత్ రెడ్డి - సంచిత బసు అనే నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో.. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఖుషి' ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్లు సంపాదించడమనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది వినడానికి బాగానే ఉన్నా.. దీన్ని సినిమాగా తీయడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. అసలు ఒక షార్ట్ ఫిల్మ్ కు సరిపడే ఇలాంటి చిన్న పాయింట్ ని తీసుకొని.. రెండు గంటల పెద్ద సినిమాగా తీయాలనే ఆలోచనే తప్పని ఆడియన్స్ అంటున్నారు.
నారాయణ ఖేడ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమించిన అమ్మాయి కోసం బెనిఫిట్ షో టికెట్ సంపాదించాలానే పాయింట్ ని తీసుకొని.. తనకు ఏం తోస్తే అది రాసేశాడు అనుదీప్. దీన్ని అదే విధంగా తెరపై ప్రెజెంట్ చేశారు అతని శిష్యులు. కామెడీ పండించడానికి సరైన సిచ్యువేషన్లు లేకపోవడం.. సిల్లీ సీన్స్ తో సినిమాని నింపేశారు.
నిజానికి అనుదీప్ కేవీ తీసిన 'జాతిరత్నాలు' సినిమాలో కూడా పెద్దగా కథేమీ ఉండదు. అతను క్రియేట్ చేసిన డంబ్ వరల్డ్ లో ఆసక్తికరమైన పాత్రలు.. ఫన్నీ సిచ్యువేషన్లు బాగా కుదిరాయి. అందుకే సిల్లీతనాన్ని పట్టించుకోకుండా.. లాజిక్ లను పక్కనపెట్టి సినిమాని ఎంజాయ్ చేశారు. కానీ ప్రతీసారి అదే వర్కౌట్ అవుతుందని అనుకోవడం పొరపాటు అవుతుంది.
ఇప్పుడు 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమా చూస్తే.. అనుదీప్ తాను ఏం రాసినా జనాలు పగలబడి నవ్వేసుకుంటారనే భ్రమలో ఉన్నాడేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'జాతి రత్నాలు' నుంచి బయటకు వచ్చి కొత్తగా ఏదైనా రాయాలని సూచిస్తున్నారు. ఇలాంటి సినిమాలే రాస్తే సెకండ్ షోకి కష్టమే అని అంటున్నారు . 'ప్రిన్స్' సినిమాతో తనెంతో చూపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు.
కంప్లీట్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'ప్రిన్స్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అనుదీప్. పాండిచ్చేరి - లండన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఇందులో శివ కార్తికేయ సరసన ఉక్రేనియన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - సురేష్ ప్రొడక్షన్స్ మరియు శాంతి టాకీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు - డి. సురేష్ బాబు నిర్మాతలు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.