Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : ఫస్ట్ డే ఫస్ట్ షో
By: Tupaki Desk | 2 Sep 2022 10:01 AM GMTచిత్రం : ఫస్ట్ డే ఫస్ట్ షో
నటీనటులు: శ్రీకాంత్ రెడ్డి-సంచిత బసు-తనికెళ్ల భరణి-వెన్నెల కిషోర్-శ్రీనివాసరెడ్డి-ప్రభాస్ శీను-వంశీధర్ గౌడ్ తదితరులు
సంగీతం: రధన్
ఛాయాగ్రహణం: ప్రశాంత్ అంకిరెడ్డి
నిర్మాతలు: శ్రీజ ఏడిద-శ్రీరామ్ ఏడిద
రచన: అనుదీప్ కేవీ
దర్శకత్వం: వంశీధర్ గౌడ్-లక్ష్మీనారాయణ
‘జాతిరత్నాలు’తో టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయ్యాడు యువ దర్శకుడు అనుదీప్ కేవీ. ఇప్పుడు అతడి కథతో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే వెరైటీ మూవీ తెరకెక్కింది. ‘జాతిరత్నాలు’ తరహాలోనే ఫన్నీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ సినిమాను అనుదీప్ శిష్యులు వంశీధర్-లక్ష్మీనారాయణ డైరెక్ట్ చేశారు. మరి అనుదీప్.. అతడి శిష్యులు కలిసి ప్రేక్షకులను ఏమేర నవ్వించగలిగారో చూద్దాం పదండి.
కథ:
శీను (శ్రీకాంత్ రెడ్డి) డిగ్రీ చదువుతున్న కుర్రాడు. అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. తన కాలేజీలోనే చదివే లయ (సుచిత బసు) అంటే శీనుకు ఇష్టం. ఆమె కూడా పవన్ అభిమానే. లయకూ తనంటే ఇష్టమని.. ఆమె ‘ఖుషి’ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోను తనతో కలిసి చూడాలనుకుందని తెలిసి ఉబ్బితబ్బిబ్బయిపోయిన శీను.. టికెట్ల వేటలో పడతాడు. ఐతే రంగంలోకి దిగాక కానీ అర్థం కాదు.. ఆ టికెట్లు సంపాదంచడం చాలా కష్టమని. మరి ‘ఖుషి’ టికెట్ల కోసం శీను పడ్డ కష్టాలు ఎలాంటివి.. చివరికి అతను టికెట్లు సంపాదించి తన ప్రేయసితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఇప్పుడంటే పెద్ద హీరో సినిమా రిలీజవుతుంటే.. ఆన్ లైన్ ‘బుక్ మై షో’ ఓపెన్ చేసి పెట్టుకుని ఇలా టికెట్లు పెట్టగానే అలా సీట్లు సెలక్ట్ చేసుకుని పేమెంట్ చేసి పడేస్తే నిమిషాల్లో టికెట్లు బుక్ అయిపోతాయి.
ఐతే ఒక 20 ఏళ్ల వెనక్కి వెళ్తే ఈ ఆన్ లైన్ బుకింగ్స్ అవీ ఏమీ లేవు. థియేటర్ల దగ్గర పడిగాపులు కాయడం.. క్యూ లైన్లో నానా అవస్థలు పడి టికెట్లు సంపాదంచడం.. లేదంటే కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తుల దగ్గరికెళ్లి లాబీయింగ్ చేసుకోవడం.. లేదంటే బ్లాక్ లో ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కోవడం.. ఇలా ఉండేది వరస. ఇప్పుడు యవ్వనంలో ఉన్న వాళ్లకు ఈ అనుభవాలేమీ లేకపోవచ్చు. కానీ 30 అంతకంటే ఎక్కువ వయసున్న సినిమా పిచ్చోళ్లను అడిగితే ఇలాంటి అనుభవాల గురించి కథలు కథలుగా చెబుతారు.
ఐతే అందులో ఏ కథ అయినా మటల్లో చెప్పడం మొదలు పెడితే ఐదు నిమిషాలో పది నిమిషాలో సమయం పట్టొచ్చు. ఆ కథలు మరీ మలుపులు.. డ్రామా ఉన్నా సరే.. ఒక పావుగంటలో ఆ కథ మొత్తం లాగించేయొచ్చు. అంతకుమించి ఎవరైనా సాగదీస్తే.. ఆపరా నీ సొల్లు అనే అంటాం. కానీ ఈ సింగిల్ పాయింట్ మీద ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీం రెండు గంటల నిడివితో సినిమా తీసింది. మరి ఎలా భరించగలం.. మధ్యలో వాకౌట్ చేయడం తప్ప?
ఎంత చిన్న పాయింట్ మీదైనా సినిమా తీయొచ్చు. కానీ దాన్ని ఎంత ఎంగేజింగ్ గా చెబుతాం అన్నది ముఖ్యం. తమిళంలో ‘వా క్వార్టర్ కటింగ్’ అని ఒక సినిమా వచ్చింది చాలా ఏళ్ల ముందు. అందులో కొన్ని గంటల్లో సౌదీ అరేబియాకు బయల్దేరాల్సి ఉన్న హీరో అక్కడికెళ్లాక మందు కొట్టే ఛాన్స్ ఉండదని తెలిసి.. రాత్రి పూట వైన్ షాపులు మూసి వేసిన టైంలో మందు బాటిల్ కోసం సిటీలో వెతుకులాట మొదలుపెడతాడు. ఈ పాయింట్ మీద రెండు గంటలకు పైగా నిడివితో ఎంతో ఆసక్తికరంగా కథను నడిపించి ఆశ్చర్యపరుస్తాడు దాని దర్శకుడు.
ఇండియాలోనే కాక ప్రపంచ స్థాయిలో ఇలా ఒక చిన్న పాయింట్ మీద ఆసక్తికరంగా కథ నడిచిన సినిమాలు చాలా కనిపిస్తాయి. ఐతే ఇలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పించడం ఆషామాషీ విషయం కాదు. మనకు తెలిసిన విషయాలనే కొంచెం అందంగా చూపిస్తూ.. అక్కడక్కడా ఆశ్చర్యపరుస్తూ.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తిస్తూ రెండు గంటల ఫీచర్ ఫిలిం తీయడం పెద్ద టాస్కే. ఐతే ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీం ఇలాంటి కసరత్తు ఏమీ చేయకుండా.. తమకు ఏం తోస్తే అది రాసేసి.. నచ్చినట్లు తీసేసి ప్రేక్షకుల మీదికి వదిలేసింది.
అనుదీప్ కేవీ తీసిన ‘జాతిరత్నాలు’లో పెద్దగా కథేమీ ఉండదు. కానీ అందులో ఆసక్తి రేకెత్తించే పాత్రలుంటాయి. వాటిని అద్భుతంగా పండించిన నటులున్నారు. ఇక వినోదం పండించడానికి అవసరమైన ఫన్నీ సిచువేషన్లు కూడా బాగానే కుదిరాయి. కాబట్టి అందులో కథ ఒక తీరుగా నడవకపోయినా.. లాజిక్ లెస్ సీన్లు పెట్టినా.. చెల్లిపోయింది.
అందులోని సిల్లీతనాన్ని ప్రేక్షకులు పట్టించుకోకుండా సినిమాను పెద్ద హిట్ చేసి పెట్టారు. కానీ దీన్ని గ్రాంటెడ్ గా తీసుకున్న అనుదీప్.. తాను ఏం రాసినా చెల్లిపోతుందని.. జనాలు పగలబడి నవ్వేసుకుంటారన్న భ్రమతో చేసిన సినిమాలా అనిపిస్తుంది ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చూస్తున్నంతసేపు. ఈ సినిమా కథేంటో ట్రైలర్లోనే చూపించినప్పటికీ.. అందులో చూపించిన పాయింట్ కాకుండా ఇందులో ఏవైనా ఉపకథలు ఉన్నాయేమో.. సినిమా కాబట్టి ఈ పాయింట్ ను బాగా డ్రమటైజ్ చేశారేమో.. మనకు తెలియని కొత్త విషయాలేమైనా చర్చించారేమో అని చూస్తే.. అసలు ఛాన్సే లేకపోయింది.
‘హీరో రెండు సినిమా టికెట్లు సంపాదించడం’ అనే ఏకైక అజెండా మీద ఈ రెండు గంటల పాటు కథను సాగతీసి.. తీసి.. ఇక చాలు మహాప్రభో సినిమా సినిమా గోల అని కాసేపటికే చేతులెత్తేసేలా చేస్తుంది ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉన్నా సరే.. ఊర్లో ఉన్న ప్రతి వాడికీ ‘ఖుషి’ సినిమా చూడ్డమే ధ్యేయం అన్నట్లు.. అమలాపురంలో టికెట్లు దొరకవని అక్కడ్నుంచి ఓ వ్యక్తి తెలంగాణలోని నారాయణ్ ఖేడ్ కు వచ్చినట్లు చూపించడం విడ్డూరం. ఇక సినిమా అంతటా కూడా ఆ రెండు టికెట్ల కోసం హీరో పోరాటమే తప్ప.. కొంచెం రిలీఫ్ కోసం అతడి ప్రేమకథనో.. ఇంకేదో వ్యవహారాన్నో చూపించే ప్రయత్నం కూడా జరగలేదు. చాలా సింపుల్ గా తేలిపోయే విషయాన్ని అనవసరంగా సాగదీస్తున్నట్లు అనిపిస్తుందే తప్ప.. టికెట్ల కోసం హీరో పడే కష్టాన్ని నవ్వించేలా కానీ.. అయ్యో అనుకునేలా కానీ చూపించలేకపోయారు.
అక్కడక్కడా అనుదీప్ మార్కు పంచులు పడ్డా సరే.. అవి కూడా రిలీఫ్ అనిపించలేని స్థాయిలో కథ నడిచే క్రమం ఇరిటేట్ చేస్తుంది. టికెట్లు సంపాదించడానికి హీరో పడే కష్టం కంటే.. సినిమా చూడ్డానికి ప్రేక్షకులు పడే కష్టం పెద్దదైపోతుంది రాను రాను. అతడికా టికెట్లేవో దొరికేస్తే సినిమా ముగించి బయటపడతాం అన్న స్థాయిలో టార్చర్ పెట్టేస్తుంది ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. అనుదీప్ అండ్ టీంకు ఈ ఐడియా ఐడియా ఎగ్జైట్ చేసి ఉంటే.. చిన్న షార్ట్ ఫిలిం ఏదో తీసుకుని యూట్యూబ్ లో వేసుకోవాల్సింది కానీ.. రెండు గంటల సినిమాగా దీన్ని తీర్చిదిద్దొచ్చని నమ్మి ఈ ప్రాజెక్టును నెత్తికెత్తుకోవడం విడ్డూరం.
నటీనటులు:
కొత్త నటుడు శ్రీకాంత్ రెడ్డి బాగానే చేశాడు. లుక్స్ పరంగా అతను యావరేజ్ అనిపించినా.. తొలి సినిమా అనే బెరుకేమీ లేకుండా ఈజ్ తో నటించాడు. హీరోయిన్ సుచిత బసు పాత్ర నామమాత్రం. ఆమెకు నటించే స్కోపే దక్కలేదు. వెన్నెల కిషోర్ అప్పుడప్పుడూ తెరపై కనిపించి ప్రేక్షకులను కాస్త కాపాడే ప్రయత్నం చేశాడు. తనికెళ్ల భరణి ‘జాతిరత్నాలు’ తండ్రి పాత్రనే ఇందులోనూ కంటిన్యూ చేసినట్లు అనిపిస్తుంది. శ్రీనివాసరెడ్డి పాత్ర ఏమంత ఇంపాక్ట్ చూపించదు. చిత్ర దర్శకుల్లో ఒకడైన వంశీధర్ గౌడ్ కూడా ఇందులో ఒక పాత్ర చేశాడు. అతను దర్శకుడిగా కంటే నటుడిగా ఆకట్టుకున్నాడు. అతను కామెడీ రోల్స్ కు సూటవుతాడనిపిస్తుంది. జబర్దస్త్ మహేష్.. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతిక వర్గం:
సంగీత దర్శకుడు రధాన్ ఒక పాటలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. నీ నవ్వే.. పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. కానీ సినిమాలో ఆ పాటకు సరైన సిచువేషన్.. టైమింగ్ కుదరలేదు. మరో పాట పర్వాలేదు. నేపథ్య సంగీతం మామూలుగా అనిపిస్తుంది. ప్రశాంత్ అంకిరెడ్డి ఛాయాగ్రహణంలో మెరుపులేమీ లేవు. నిర్మాణ విలువలు మరీ సాధారణంగా ఉన్నాయి. అనుదీప్ కేవీ కథే పేలవం. ఏదో ఒక పాయింట్ మీద ఎగ్జైట్ అయిపోయి తోచింది రాసి తీసేసినట్లు అనిపిస్తుంది. అసలు ఇందులో కథ.. స్క్రీన్ ప్లే అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలాగే వంశీధర్ గౌడ్.. లక్ష్మీనారాయణల దర్శకత్వ ప్రతిభ గురించి మాట్లాడడానికి కూడా ఏమీ లేదు.
చివరగా: ఫస్ట్ డే ఫస్ట్ షో.. వాకౌట్
రేటింగ్ - 1/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre