Begin typing your search above and press return to search.
జగన్ ఐనా క్లారిటీ ఇవ్వాలంటున్న సురేష్ బాబు
By: Tupaki Desk | 5 Jun 2019 11:05 AM GMTతెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన సమయంలో తెలుగు సినిమా పరిశ్రమ కూడా విడిపోతుందేమో అని.. ఏపీకి సినిమా పరిశ్రమ వెళ్లి పోతుందేమో అని అంతా భావించారు. అయితే హైదరాబాద్ లో సెటిల్ అయిన సినిమా పరిశ్రమ ప్రముఖులు మరో చోటుకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే ఏపీలో స్టూడియోలు ఏర్పాటు చేసి అక్కడ నుండి కూడా సినిమాల నిర్మాణం చేసేందుకు సిద్దంగా ఉన్నారు. కాని గత తెలుగు దేశం ప్రభుత్వం మాత్రం ఏపీలో సినిమా పరిశ్రమ కోసం చాలా ప్రయత్నించినట్లుగా అనిపించినా కూడా సరైన క్లారిటీ ఇవ్వక పోవడంతో ఈ అయిదు సంవత్సరాల్లో ఒక్క స్టూడియో నిర్మాణంకు పునాది రాయి పడలేదు.
కొన్నాళ్లు వైజాగ్ లో సినిమా పరిశ్రమ అంటూ ప్రచారం చేయగా మరి కొన్ని రోజులు అమరావతిలోనే తెలుగు సినిమా పరిశ్రమకు భూములు ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేక పోవడం వల్లే ఏపీలో స్టూడియోల నిర్మాణం ప్రారంభం కాలేదు అంటూ ప్రముఖ నిర్మాత.. టాలీవుడ్ ప్రముఖుడు అయిన సురేష్ బాబు అన్నారు.
ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ది గురించి త్వరలోనే కొత్త సీఎం జగన్ ను కలవాలని భావిస్తున్నట్లుగా సురేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఏపీలో సినిమా పరిశ్రమ ఏర్పాటు ఆవశ్యకత చాలా ఉందని.. అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో యువత హైదరాబాద్ దాకా రావాల్సి ఉంటుందని.. అక్కడే పరిశ్రమ ఏర్పాటు అయితే హైదరాబాద్ వరకు వచ్చే అవసరం ఉండదు అంటూ సురేష్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ప్రభుత్వం సినిమా పరిశ్రమ విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత స్టూడియోల నిర్మాణం జరుగుతుందని చెప్పుకొచ్చారు. స్టూడియోల నిర్మాణం పెద్ద విషయం ఏమీ కాదు. పరిశ్రమ మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయ్యి ఉంటే బాగుంటుంది. అందుకే వైజాగ్ అమరావతి అనే కన్ఫ్యూజన్ లో తాము ఉన్న కారణంగా స్టూడియోల ఏర్పాటు ఆలస్యం అవుతుందని.. ఈ విషయంలో జగన్ అయినా క్లారిటీ ఇవ్వాలని సురేష్ బాబు అన్నాడు.
ఇక సురేష్ ప్రొడక్షన్స్ కేవలం సినిమా నిర్మాణం మాత్రమే కాకుండా జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పెద్ద ప్రాజెక్ట్ లను ముందుకు తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ నిర్మాణ సంస్థ అయిన వాల్ డిస్నీతో కలిసి హిరణ్య కశిప సినిమాను నిర్మించబోతున్నట్లుగా సురేష్ బాబు చెప్పుకొచ్చాడు.