Begin typing your search above and press return to search.
'పెదకాపు'గా వస్తున్న వారసుడు
By: Tupaki Desk | 2 Jun 2023 1:04 PMటాలీవుడ్ లో తనదైన ఫ్యామిలీ చిత్రాల తో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. కుటుంబ కథా చిత్రాల తో ప్రేక్షకుల ను అలరిస్తోన్న ఆయన.. కొంత కాలంగా సరైన హిట్ కోసం వేచి చూస్తోన్నారు. ఈ క్రమం లోనే చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'అఖండ' టీమ్ తో సినిమా ను చేస్తోన్నారు. ఇటీవలే దీని పై అధికారిక ప్రకటన వెలువడింది.
'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మిర్యాల రవీందర్ రెడ్డి తన ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రమే 'పెదకాపు 1'. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంతో రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ హీరో గా పరిచయం అవుతున్నాడు. దీంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా విడుదలైన 'పెదకాపు 1' ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిపోయింది. ఇక, ఇందులో విరాట్ కర్ణ మాస్ లుక్ తో దర్శనమిచ్చాడు. అంతేకాదు, అతడు పల్లెటూరు లోని ఓ వర్గానికి లీడర్ గా నూ కనిపిస్తున్నాడు. అలాగే దీనిపై 'ఓ సామాన్యుడి సంతకం' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఇది ఆరంభం లోనే అందరి దృష్టి నీ ఆకర్షించింది.
ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 90వ దశకం నాటి రాజకీయాలు.. గొడవలు.. కులాల మధ్య చిచ్చుల వల్ల వచ్చే సమస్యల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే దీని కి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయిందని తెలుస్తోంది. ఇక, దీని తో పాటు మరో బిగ్ అప్‌డేట్ ను కూడా వదలబోతున్నామని, దాని కోసం వేచి చూడండి అంటూ చిత్ర యూనిట్ వెల్లడించింది.
సాధారణంగా శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు పల్లెటూరి ప్రాంతాల్లో కనిపించే ఎన్నో సున్నిత మైన అంశాల ను టచ్ చేసే విధంగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు క్యాస్ట్ కాంట్రవర్శీతో రాబోతున్న ఈ చిత్రంలో ఆయన ఎన్నో వివాదాస్పద అంశాల ను ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఈ చిత్రం కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.