Begin typing your search above and press return to search.
బాస్ ఈజ్ బ్యాక్.. మెగాస్టార్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అదిరింది!
By: Tupaki Desk | 4 July 2022 12:50 PM GMTమెగాస్టార్ చిరంజీవి ఇటీవల `ఆచార్య` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపించలేక ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `గాడ్ ఫాదర్`. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు.
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన `లూసీఫర్` ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మెగాస్టార్ గ్యాంగ్ స్టర్ పాత్రలో తొలిసారి నటిస్తున్న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే సోమవారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ కుర్తా.. బ్లాక్ గాగుల్స్ ధరించి.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కార్ లోంచి స్టైల్ గా దిగినడిచి వెళుతున్న చిరు లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో చిరుకు అసిస్టెంట్ గా సునీల్ కనిపించబోతున్నారు.
ఫస్ట్ లుక్ వీడియోలో బ్లాక్ కార్ లోంచి చిరు దిగుతుండగా సునీల్ డోర్ ఓపెన్ చేస్తూ చిరుకు అసిస్టెంట్ గా కనిపించాడు. నెరిసిన వైట్ హెయిర్ తో కూలింగ్ గాగుల్స్ ధరించి స్టైలిష్ గా సూపర్ కూల్ గెటప్ లో చిరు కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
ఈ మూవీని ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఈ ఏడాది విజయదశమికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇక చిరు ఎంట్రీ ఇస్తున్న ఈ ఫస్ట్ లుక్ వీడియోకు తమన్ అందించిన బీజీఎమ్ అదరిపోయింది. చిరు స్టైల్ ని, ఆయన పాత్రని మరింత ఎలివేట్ చేసింది.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్నఈ మూవీ మాసెస్ కి, చిరు ఫ్యాన్స్ కి దసరా రోజు తిరుగులేని ఫీస్ట్ ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీకి నీరవ్ షా ఛాయాగ్రహణం, సంగీతం తమన్, ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ సురేష్ సెల్వరాజ్.