Begin typing your search above and press return to search.
స్టూవర్ట్ పురం దొంగ .. బెల్లంకొండ లుక్ పరేషానులే
By: Tupaki Desk | 4 Nov 2021 12:59 PM GMTయువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన అభిమానులకు దీపావళి గిఫ్ట్ ఇచ్చారు. స్టూవర్ట్ పురం దొంగ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ లను దీపావళి స్పెషల్ గా అధికారికంగా విడుదల చేశారు. విడుదల చేసిన రెండు పోస్టర్లలో అతను క్రూరమైన గజదొంగగా కనిపిస్తున్నాడు.
కదులుతున్న రైలు కి క్లోజప్ స్టిల్.. రెండు రైఫిల్స్ ని చేతపట్టి అతడు కనిపించిన తీరుతోనే భయపెడుతున్నాడు. పోస్టర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. బెల్లంకొండ తన కెరీర్ ఛాలెంజింగ్ రోల్ లో చేస్తున్నాడని ఈ పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి. యాక్షన్ హీరోగా అతడికి ఉన్న ఇమేజ్ ని ఇది పదింతలు చేయనుందన్న కాన్ఫిడెన్స్ ని పోస్టర్లు ఇస్తున్నాయి. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన సాహసోపేతమైన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో అతడు నటిస్తున్నాడని ఇటీవల ప్రచారమైంది. కానీ ఆ కథలో మాస్ మహారాజా రవితేజ నటిస్తారని మరో ప్రచారం ఉంది.
కానీ ఇంతలోనే స్టూవర్డ్ పురం దొంగ అంటూ సడెన్ ట్విస్ట్ ని ఇచ్చింది చిత్రబృందం. టైగర్ నాగేశ్వరరావు జీవిత కథలో బెల్లంకొండ నటిస్తున్నారని దీనిని బట్టి ఖాయమైంది. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సహచరుడు కెఎస్ తొలి చిత్ర దర్శకుడిగా దీనిని తెరకెక్కించనున్నాడు. ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం.