Begin typing your search above and press return to search.
8న బన్నీ ఫస్ట్ లుక్ ఖాయమేనా..?
By: Tupaki Desk | 3 April 2020 3:47 AM GMTస్టైలిష్ చిత్రాల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసను మాట్లాడుతూ నెరిసిన గడ్డంతో లారీ డ్రైవర్ గా ఊర మాస్ లుక్కులో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆల్రెడీ రష్మికను హీరోయిన్ గా ఖరారు చేసారు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేయాల్సిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కరోనా కారణంగా మొత్తం ప్లానింగ్ అంతా దెబ్బపడింది. ఈ కాంబినేషన్లో సినిమా ఓకే అయి ఏడాది దాటుతున్నా చిన్న అప్డేట్ కూడా లేక పోవడం అభిమానుల్ని నిరాశ పరుస్తోంది.
కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ నిలిపేసిన సుక్కు చివరి సినిమా ‘రంగస్థలం’. రిలీజై రెండేళ్లు పూర్తి కావడంతో ఆయన మీద విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బన్నీ, సుక్కుల అభిమానులకు ఊరటనిచ్చేందుకు కనీసం సినిమా ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయాలని ఫిక్సయిందట చిత్ర బృందం. అందుకోసమే ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా బన్నీ లుక్ రిలీజ్ చేసి కొంచెం ఊరట కలిగిద్దామని అనుకున్నారట. ఫోటో షూట్ కూడా చాలా బాగా వచ్చిందని సమాచారం. ప్రస్తుతం సుక్కు టీమ్ ఫస్ట్ లుక్ మీద వర్క్ చేస్తున్నారట. ఇంకో వారంలో సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఖాయమంటున్నారు. చూడాలి మరి ఏం జరుగనుందో..