Begin typing your search above and press return to search.

నయనతార GOLD ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్

By:  Tupaki Desk   |   7 Jun 2022 2:30 AM GMT
నయనతార GOLD ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్
X
మ‌ల‌యాళీ బ్యూటీ అయినా కానీ న‌య‌న‌తార త‌మిళం - తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో న‌టించింది. త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో `త‌లైవి` గా అరుదైన‌ గౌర‌వం అందుకున్న ఏకైక నాయిక‌. ఒక్కో సినిమాకి దాదాపు 6 కోట్లు డిమాండ్ చేస్తున్న టాప్ హీరోయిన్ గానూ పాపుల‌రైంది. కార‌ణం ఏదైనా కానీ.. మాతృప‌రిశ్ర‌మను న‌య‌న్ మ‌రిచిపోయిందా? మ‌ల‌యాళంలో ఎందుక‌ని న‌టించ‌డం లేదు? అన్న సందేహాలు అభిమానుల్లో అలానే ఉన్నాయి. అయితే న‌య‌న‌తార అడ‌పాద‌డ‌పా మాతృభాష‌లోనూ న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం `గోల్డ్` అనే మ‌లయాళ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ భారీ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్- నయనతార జంటగా నటిస్తున్నారు. ఈరోజు సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇందులోని అన్ని పాత్రలతో పోస్టర్ నిండిపోయింది. ఇటీవల విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ చిత్రంలో అజ్మల్ అమీర్- లాలూ అలెక్స్- మల్లికా సుకుమారన్- షమ్మీ తిలకన్- బాబురాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రైటింగ్- ఎడిటింగ్- స్టంట్స్- VFX- యానిమేషన్ ఇవ‌న్నీ ద‌ర్శ‌కుడు ఆల్ఫోన్స్ హ్యాండిల్ చేస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. దర్శకత్వం ఆల్ఫోన్స్ పుత్రేన్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్- మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాజేష్ మురుగేషన్ సంగీతం అందించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించేసిన న‌య‌న‌తార మాతృప‌రిశ్ర‌మ‌ను మ‌ర్చిపోకుండా ఇలా బ్యాలెన్స్ చేస్తోంద‌న్న‌మాట‌.

పెళ్లిపై అభిమానుల్లో క్యూరియాసిటీ..

అందాల న‌య‌న‌తార కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నా కానీ మ‌రోవైపు ల‌వ్ లైఫ్ ని అంతే జాయ్ ఫుల్ గా లీడ్ చేస్తున్నారు. త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ని న‌య‌న్ పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 9న ఈ జంట వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. మహాబలిపురంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో హిందూ సంప్రదాయాల ప్రకారం నయన్ పెళ్లి జరగనుందని విశ్వసనీయ వర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల మధ్య విఘ్నేష్ న‌య‌న్ మెడ‌లో తాళి కట్టు ముహూర్తం నిర్ణ‌యించార‌ట‌. అదే వేదికపై జూన్ 8 సాయంత్రం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు .. రాజకీయ నాయకుల కోసం గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేసారని తెలిసింది.

ఈ పెళ్లికి రజనీకాంత్- చిరంజీవి- కమల్ హాసన్- షారూక్ ఖాన్- అజిత్- విజయ్- సూర్య- కార్తీ- విజయ్ సేతుపతి- విజయ్ సేతుపతి వంటి టాప్ సెలబ్రిటీలు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నారని టాక్ వినిపిస్తోంది. నయనతార ప్ర‌స్తుతం షారూక్ సరసన జవాన్ సినిమాలో కనిపించనున్నారు. అదే క్ర‌మంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ పెళ్లికి హాజరవుతార‌ని ఊహ‌గానాలు సాగుతున్నాయి.

ఇప్ప‌టికే ఈ జంట స్వ‌యంగా ప‌లువురిని గ్రాండ్ వెడ్డింగ్ కు ఆహ్వానించడానికి క‌లుసుకుంటున్నారు. 9 జూన్ 2022న మహాబలిపురంలో జరగనున్న తమ వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు నయనతార- విఘ్నేష్ శివన్ ఇద్దరూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను ఇటీవ‌ల‌ కలిశారు. సినీనటుడు.. సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను కూడా ఆహ్వానించారు. ఈ వేడుకకు పలువురు స్టార్ హీరోలు.. ఇతర సెలబ్రిటీలు హాజరుకానున్నట్లు తెలిసింది. ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్రత్యేకంగా NETFLIXలో చిత్రీకరించి ప్రీమియర్ గా ప్రదర్శిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ఈవెంట్ కి దర్శకత్వం వహించే బాధ్యతను గౌతం మీనన్ కు అప్పగించారని ప్ర‌చార‌మ‌వుతోంది.