Begin typing your search above and press return to search.

ధనుష్ 'సార్' ఏం చేస్తాడో?

By:  Tupaki Desk   |   26 July 2022 5:39 AM GMT
ధనుష్ సార్ ఏం చేస్తాడో?
X
కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన శక్తి మేరకు అని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. నటుడిగా ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్న ధనుష్ ఇటీవల ఏకంగా అవెంజర్స్ దర్శకులతో కలిసి ది గ్రె మ్యాన్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమాలో అతనికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు దక్కలేదు కానీ అక్కడి వరకు వెళ్ళాడు అంటే ఒక విధంగా భవిష్యత్తుకు మంచి దారి దొరికినట్లే అని చెప్పవచ్చు.

ఇక భవిష్యత్తులో కూడా అతను మరిన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం కూడా ఉండేందుకు అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ధనుష్ తన ఫోకస్ మొత్తం కూడా ఒక ద్విభాషా చిత్రంపై పెట్టాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సార్ సినిమాలో ధనుష్ ఒక భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంతవరకు ఎప్పుడూ కూడా ధనుష్ ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించలేదు. మొట్టమొదటిసారి అతను స్కూల్లో టీచర్ గా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి ఇక సార్ సినిమాను తెలుగు దర్శకుడు వెంకీ తెరపైకి తీసుకువస్తూ ఉండడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాలను సీతారా ఎంటర్టైన్మెంట్ తో పాటు త్రివిక్రమ్ హోం బ్యానర్ ఫార్చూన్ 4 సినిమాస్ కూడా సంయుక్తంగా నిర్మిస్తోంది. ఫైనల్ గా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ పై కూడా అప్డేట్ అయితే ఇచ్చేశారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ జులై 27న, టీజర్ జూలై 28 తేదీల్లో విడుదలవుతాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అదే విషయాన్ని తెలియజేసేందుకు కొత్త పోస్టర్ కూడా షేర్ చేయబడింది. ఈ ద్విభాషా చిత్రంలో సంయుక్తా మీనన్ కథానాయిక నటిస్తుండగా.. సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక సార్ చిత్రానికి జివి ప్రకాష్ సంగీత దర్శకుడు.

సినిమా షూటింగ్ అయితే దాదాపు దశకు చేరుకుంది ఇక మరో రెండు నెలల్లో సినిమాకు సంబంధించిన పూర్తి పనులన్నీటిని ముగించుకొని వీళ్లను అంత త్వరగా విడుదల చేయాలని అనుకుంటున్నారో మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి గుర్తింపును అందుకుంటాడో చూడాలి.