Begin typing your search above and press return to search.
బాలీవుడ్ దరిద్రపుగొట్టు క్రియేటివిటీ ఇదీ..
By: Tupaki Desk | 4 Nov 2015 6:57 AM GMTహాలీవుడ్ వాళ్లు కూడా చాలానే అడల్ట్ కామెడీలు తీశారు. కానీ ఎప్పుడూ కూడా ప్రమోషన్ల విషయంలో ఇంతగా దిగజారి పోలేదు. మల్లూ వుడ్ లో శృంగార భరిత చిత్రాలొస్తుంటాయి. వాటి పోస్టర్లు కూడా ఇంత దారుణంగా ఎప్పుడూ లేవు. మొత్తానికి బాలీవుడ్ వాళ్లు తమకు తామే సాటి అని రుజువు చేసుకున్నారు. అడల్ట్ కామెడీల్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్లకు కూడా జుగుప్స పుట్టేలా ఓ పోస్టర్ వదిలింది ‘మస్తీ జాదే’ టీమ్. తుషార్ కపూర్ అరటిపండుతో చేస్తున్న విన్యాసం గురించి ఏమని వర్ణించాలి?
కాసుల కక్కుర్తిలో భాగంగా బాలీవుడ్ వాళ్లు ఇంతకుముందు తీసిన మస్తీ - గ్రాండ్ మస్తీ సినిమాలు చూసి అడల్ట్ కామెడీ ప్రియులు తరించి పోయారు. ‘గ్రాండ్ మస్తీ’ వంద కోట్ల కలెక్షన్ లతో ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఓ ల్యాండ్ మార్క్ ఫిలిం అయింది. ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు ‘మస్తీ జాదే’ అనే అడల్డ్ కామెడీ వస్తోంది. ఈ సినిమా విషయంలో పూర్తిగా సిగ్గూ ఎగ్గూ వదిలేశారని ఈ పోస్టర్ చూస్తే అర్థమైపోతోంది. బూతు కంటెంట్ ఈ స్థాయిలో ఉంది కాబట్టి కొన్ని నెలలుగా సెన్సార్ వాళ్లు దీనికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కానీ ఏం చేశారో ఏమోగానీ.. ఈ మధ్యే సర్టిఫికెట్ ఇచ్చేశారు. త్వరలోనే విడుదలకు కూడా రెడీ అయిపోతోంది. అన్నట్లు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా.. పోర్న్ దేవత సన్నీ లియోన్.