Begin typing your search above and press return to search.

మొహాలు దాచిపెట్టే ఫస్ట్ లుక్‌ ట్రెండ్‌

By:  Tupaki Desk   |   18 Aug 2015 6:14 PM GMT
మొహాలు దాచిపెట్టే ఫస్ట్ లుక్‌ ట్రెండ్‌
X
సినిమాల పబ్లిసిటీ స్టైల్ మారిపోయింది. జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి.. మూవీ గురించి మాట్లాడుకునేలా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు మూవీ మేకర్స్. తాజాగా పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. తానే దగ్గరుండి డిజైన్ చేయించుకున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ ఉంటాడు కానీ... మనకు పవర్ స్టార్ ఫేస్ మాత్రం స్పష్టంగా కనిపించదు. మెగావారసుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో క్రిష్ తీస్తున్న కంచె ఫస్ట్ లుక్ పరిస్థితీ ఇదే. భుజాన గన్ వేసుకుని.. సుదూర ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఓ వ్యక్తి నీడ ఉంటుందంతే.

ఈ ట్రెండ్ మన టాలీవుడ్ లో పుట్టినదేమీ కాదు. మనోళ్లు బాలీవుడ్ నుంచి అరువు తెచ్చుకున్నారు. వాళ్లు హాలీవుడ్ నుంచి కాపీ కొడుతున్నారు లెండి అది వేరే విషయం. వచ్చే ఏడాది రంజాన్ కు తెరపైకి రానున్న షారుక్ ఖాన్ మూవీ ఫ్యాన్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు కానీ.., ఫేస్ మొత్తం చూపించలేదు. ఇందులో షారూక్ డబుల్ రోల్ పోషిస్తుండగా... ఆ మాత్రమైనా కనిపించినది ఫ్యాన్, స్టార్ల లో ఏ కేరక్టరో స్పష్టత ఇవ్వలేదు, ప్రియాంక చోప్రా నటిస్తున్న గంగాజల్ 2 రూట్ కూడా ఇదే. మొహం కనిపించకుండా.. చేతిలో ఓ గన్ ఉంచారంతే.

ఫాంటమ్ పోస్టర్ లో అయితే సైఫ్, కత్రినాల కళ్లకు జాతీయజెండా కట్టేశారు, కంగన, ఇమ్రాన్ ఖాన్ ల కాళ్లు చూపిస్తున్న కట్టీ బట్టీ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా సల్మాన్ సూపర్ హిట్ భజరంగీ భాయిజాన్ ఫస్ట్ లుక్ కూడా ఇలాగే ఉంది. సల్లూభాయ్ నోటి నుంచి ఛాతి వరకూ చూపిస్తూ... పోస్టర్ రిలీజ్ చేశారు. గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ అక్షయ్ కుమార్‌ మీసం, గెడ్డం, కనుబొమ్మలు మాత్రమే కనిపించే ఫొటో సంచలనం సృష్టించింది. దిల్ ధడ్కనే దో' ఫస్ట్ లుక్ తో... పాత్రల గురించి వివరించేసింది దర్శకురాలు. అందులో ఎవరి ముఖమూ లేకుండా.. ఓ పెద్ద ఓడలో పడక కుర్చీలమీద సేదతీరుతున్న ఆరుగురు కనిపిస్తారంతే.

ఇకపోతే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న 'బాజీరావ్ మస్తానీ' ఫస్ట్‌ లుక్‌ లోనూ రణ్‌వీర్ సింగ్ ఫేస్ కనిపించదు. ఇలా ఫేస్ చూపించకుండా... జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు డైరెక్టర్లు. ఎక్స్ పెక్టేషన్స్ లేని సినిమాలకు కూడా... ఈ తరహా పబ్లిసిటీ తో మంచి క్రేజ్ వస్తోంది. దీంతో ఈ ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు చాలామంది.