Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: వీడు చాలా స్పెషల్
By: Tupaki Desk | 16 Jun 2019 5:44 AM GMTపోటీ ప్రపంచంలో ర్యాంకులు వస్తే చాలు పిల్లలకు ప్రపంచ జ్ఞానం లేకపోయినా పర్వాలేదు అనే ధోరణి ఇప్పటి తల్లితండ్రుల్లో విపరీతంగా పెరిగిపోయింది. దాని వల్లే ఒత్తిళ్ళు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కార్పోరేట్ విద్య వచ్చాక సృజనాత్మకత ఆటకెక్కిన తరుణంలో ఈ పోకడను ఆధారం చేసుకుని వస్తున్న సినిమా ఫస్ట్ ర్యాంక్ రాజు. దీని ట్రైలర్ ఇందాక విడుదలైంది. కథ విషయానికి వస్తే తనకు పుట్టిన బిడ్డకు పేరులోనే ర్యాంక్ పెడతాడు ఓ తండ్రి(సీనియర్ నరేష్). దాంతో ఆ పిల్లాడు చదువే లోకంగా బొత్తిగా లౌక్యం లేకుండా బ్రతుకుతూ చదువులో మాత్రం ఫస్ట్ ఉంటాడు.
అతని అమాయకత్వం అందరికి వినోదం అవుతుంది. తనను ఇష్టపడిన అమ్మాయి(కషిష్ ఓరా)సైతం అయోమయంలో పడేంతగా. ఇలా ఉంటె లాభం లేదని గుర్తించిన రాజు వేషం మార్చి మాడరన్ యూత్ గా ఎవరు ఊహించని రీతిలో కొత్త అవతారం ఎత్తుతాడు. అప్పటిదాకా సజావుగా సాగిన అతని జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఎవరూ జీర్ణించుకోలేకపోతారు. అనుకోని ప్రమాదం చుట్టుముడుతుంది. ప్రియురాలు దూరమవుతుంది. అసలు ర్యాంక్ రాజు లైఫ్ ఇంత గందరగోళంగా ఎందుకు మారింది తెలియాలంటే స్క్రీన్ మీద చూడాల్సిందే
కాన్సెప్ట్ లో ఫ్రెష్ నెస్ ఉంది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న సున్నితమైన సమస్యకు హాస్యాన్ని జోడించి కొంత సీరియస్ గా కొంత ఎమోషనల్ గా నడిపించిన తీరు ఆసక్తి రేపెలా ఉంది. హీరో చేతన్ మద్దినేని రెండు షేడ్స్ లో నమ్మలేనట్టుగా మేకోవర్ చూపించాడు. థీమ్ బేస్డ్ మూవీ కాబట్టి హీరొయిన్ కషిష్ ఓరా గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేదు. నరేష్-ప్రకాష్ రాజ్-తనికెళ్ళ భరణి-రావు రమేష్ - వెన్నెల కిషోర్ - పోసాని - ప్రియదర్శి లాంటి సీనియర్ స్టార్ క్యాస్ట్ దీనికి బలంగా నిలుస్తోంది.
కిరణ్ రవీంద్రనాథ్ సంగీతం చక్కగా కుదిరింది. హెచ్ ఎన్ నరేష్ కుమార్ దర్శకత్వంలో టేకింగ్ ఆకట్టుకునేలా ఉంది. ఆర్టిస్టుల టైమింగ్ ని బాగా వాడుకున్నాడు. వ్యంగ్య ధోరణిలో పేరెంట్స్ కు చురకలు వేస్తూనే మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న ఫస్ట్ ర్యాంక్ రాజు ట్రైలర్ తో అయితే ఆకట్టుకున్నాడు. మరి కంటెంట్ తో ఎలా మెప్పించాడో తెలియాలంటే 21న చూడాల్సిందే