Begin typing your search above and press return to search.
ఫస్ట్ సింగిల్: 'తలైవి' నుంచి 'ఇలా ఇలా'..!
By: Tupaki Desk | 31 March 2021 1:34 PM GMTబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ''తలైవి''. తమిళులు 'పురచ్చి తలైవి'గా పిలుచుకునే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 23న భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు.. 'తలైవి' ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
'తలైవి' చిత్రం నుంచి 'ఇలా ఇలా' అనే గీతాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా వదిలిన కంగనా పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు జీవీ ప్రకాశ్ స్వరాలు సమకూర్చగా.. లిరిసిస్ట్ సిరాశ్రీ సాహిత్యం అందించారు. జీవీ సతీమణి, గాయని సైంథవి ప్రకాశ్ ఈ గీతాన్ని ఆలపించారు. దీనికి బృందాగోపాల్ కొరియోగ్రఫీ చేశారు. ఇకపోతే ఈ చిత్రానికి 'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ రచన చేశారు. ఈ చిత్రంలో ఎంజీఆర్ గా అరవింద స్వామి.. కరుణానిధిగా సముద్రఖని.. జయలలిత తల్లి సంధ్యగా భాగ్యశ్రీ.. జానకీ రామచంద్రన్ గా మధుబాల నటించారు. విష్ణువర్థన్ ఇందూరి - శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా 'తలైవి' సినిమాని నిర్మిస్తున్నారు.