Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ సింగిల్ : హృతిక్ మెస్మ‌రైజ్‌ చేశాడుగా!

By:  Tupaki Desk   |   17 Sep 2022 11:54 AM GMT
ఫ‌స్ట్ సింగిల్ : హృతిక్ మెస్మ‌రైజ్‌ చేశాడుగా!
X
మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి తొలి రాంబినేష‌న్ లో త‌మిళంలో రూపొందిన నియో నాయిర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'విక్ర‌మ్ వేద‌'. పుష్క‌ర్ - గాయ‌త్రి ద‌ర్శ‌క‌ద్వ‌యం రూపొందించింది. 2017లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ 65వ ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాల్లో ఏడు కేట‌గిరీల్లో నామినేష‌న్స్ సాధించి ప‌లు అవార్డుల్ని ద‌క్కించుకుంది. క‌ల్ట్ యాక్ష‌న్ సినిమాల్లో స‌రికొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికిన ఈ మూవీని ప్ర‌క‌స్తుతం హిందీలో రీమేక్ చేశారు.

హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. త‌మిళంలో మాధ‌వ‌న్ పోషించిన పాత్ర‌ని సైఫ్ అలీఖాన్ పోషించ‌గా విజ‌య్ సేతుప‌తి పాత్ర‌ని హృతిక్ రోష‌న్ పోషించి బాలీవుడ్ తో పాటు ద‌క్షిణాది వారిని కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు.

త‌మిళ మాతృక‌ని మించి మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా ఈ మూవీని రీమేక్ చేశారు. ఫ‌స్ట్ లుక్ నుంచి ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీ టీజ‌ర్ తో మ‌రింత ఆస‌క్టిని పెంచింది. రీసెంట్ గా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ప‌వ‌ర్ ప్యాక్డ్ ఇంటెన్స్ డ్రామాగా ఆక‌ట్టుకుని సినిమాపై దేశ వ్యాప్తంగా మ‌రింత బ‌జ్ ని క్రియేట్ చేసింది.

రాధికా ఆప్టే కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని వ‌ర‌ల్డ్ వైడ్ గా సెప్టెంబ‌ర్ 30న భారీ స్థాయిలో విడుద‌ల చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు స‌రిగ్గా 13 రోజులే మిగిలి వున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ శ‌నివారం ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ గా మాసీవ్ నంబ‌ర్ ని విడుద‌ల చేశారు.

హృతిక్ రోష‌న్ పై చిత్రీక‌రించిన 'ఆజ్ మౌసం ఆల్క‌హోలియా..' అంటూ సాగే వీడియోని విడుద‌ల చేశారు. విశాల్ - శేఖ‌ర్ సంగీతం అందించిన ఈ పాట‌కు మ‌నోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించారు.

మామూలుగానే హృతిక్ మెస్మ‌రైజింగ్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేస్తాడు. ఈ పాట‌కు కూడా అదే స్థాయిలో డ్యాన్స్ తో ఇర‌గ‌దీశాడు. పెప్పీనంబ‌ర్ గా షూట్ చేసిన ఈ సాంగ్ హృతిక్ అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. విశాల్ - శేఖ‌ర్ అందించిన సంగీతానికి హృతిక్ అదిరిపోయే స్టెప్పులేయ‌డంతో పాట థియేట‌ర్ల‌లో ఓ రేంజ్ లో పేలేలా క‌నిపిస్తోంది. 175 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.