Begin typing your search above and press return to search.

'డర్టీ హరి' నుంచి మరో సర్ప్రైజ్...!

By:  Tupaki Desk   |   22 July 2020 6:30 PM IST
డర్టీ హరి నుంచి మరో సర్ప్రైజ్...!
X
టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సీనియర్‌ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు దర్శకుడిగా మారి 'వాన' 'తూనీగ తూనీగ' వంటి చిత్రాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఈసారి ఏకంగా 'డ‌ర్టీ హరి' పేరుతో తనలోని మరో కోణాన్ని బయటపెడుతున్నారు. నేటి యువతను దృష్టిలో పెట్టుకొని రొమాంటిక్‌ థ్రిల్లర్‌ గా రూపొందించిన ఈ సినిమాలో శ్రవణ్‌రెడ్డి - రుహానీ శర్మ - సిమ్రత్‌ కౌర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో సతీష్ బాబు - సాయి పునీత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే 'డ‌ర్టీ హరి' ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ రొమాంటిక్ ట్రైలర్‌ కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంలోని 'లెట్స్ మేక్ లవ్' వీడియో సాంగ్ ఈనెల 24న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'డర్టీ హరి' ట్రైలర్‌ కి అనూహ్యమైన స్పందన లభించింది. రిలీజైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలు లభించాయన్నారు. డైరెక్టర్ ఎం.ఎస్.రాజు గారు కథని మలిచిన విధానం యూత్‌ ని బాగా ఆకట్టుకోనుంది అనడానికి ఇది ఉదాహరణ అని.. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ 'లెట్స్ మేక్ లవ్' పూర్తి వీడియోతో ఈ నెల 24న మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నామని.. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని చెప్పుకొచ్చారు. కాగా ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీతం అందించగా ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించారు.