Begin typing your search above and press return to search.
షోలే బయోపిక్ వచ్చేసింది
By: Tupaki Desk | 10 March 2019 1:30 AM GMTఅదేంటి హీరోల మీదనో రాజకీయ నాయకుల మీదనో బయోపిక్ రావాలి కానీ షోలే మీద ఏంటి అనే అనుమానం వచ్చిందా. ఇక్కడ కథ వేరే ఉంది. భారతీయ సినిమా చరిత్రలో షోలేకున్న స్థాయి స్థానం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షోలేకి ముందు షోలేకి తర్వాత అని ఇండియన్ సినిమాని విభజించి రాసుకునే రేంజ్ లో సక్సెస్ అయిన ఆ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ సిప్పీ కుటుంబానికి కల్పతరువుగా ఆదాయాన్ని ఇస్తూనే ఉన్న షోలే మీద ఓ బయోపిక్ నిజంగానే వచ్చింది.
కాకపోతే సినిమా ముందున్న వాళ్ళ గురించి కాదు. తెరవెనుక పడిన కష్టపడిన ఓ లేడీ స్టంట్ మాస్టర్ గురించి. షోలేలో హేమ మాలిని చేసిన రిస్కీ షాట్స్ లో డూప్ గా పని చేసి ఆ తర్వాత ఎన్నో వందల సినిమాల్లో ఇది తరహా స్టంట్స్ తో పేరు తెచ్చుకున్న రేష్మా పటాన్ మీద జీ 5 సంస్థ ఓ వెబ్ మూవీ చేసింది. దాని పేరే ది షోలే గర్ల్. బిదితా బేగ్ టైటిల్ రోల్ పోషించింది.
షోలేలో ఓ గుర్రపు బగ్గి సీన్ ఉంటుంది. విలన్లు వెంటాడుతుండగా హేమ మాలిని ప్రాణాలకు తెగించి తన జట్కా మీద తప్పించుకునే సీన్ చాలా రిస్క్ తో తీశారు. అసలు ఏ టెక్నాలజీ వాడకుండా అంత రిస్కీ ఎపిసోడ్ ఎలా తీశారు అనేది ఇప్పటికీ ఓ కేస్ స్టడీ లాంటిది. పైకి మనం చూసేది హేమ మాలిని అయినప్పటికీ నిజానికి అందులో లైఫ్ ని రిస్క్ లో పెట్టి చేసింది ఈ రేష్మా పటాన్. ఆమె ఇందులో ఎలా పాల్గొంది లాంటి విశేషాలతో పాటు రేష్మా లైఫ్ లోని కొన్ని కీలకమైన ఘట్టాలను టచ్ చేస్తూ ఆదిత్య సర్పోద్తర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని శరాబని-శశి అనే తల్లి కూతుళ్ళు నిర్మించారు.
అయితే ఈ సినిమా చూడాలంటె థియేటర్ అవసరం లేదు. జీ 5 సంస్థ నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఆన్ లైన్ లో విడుదల చేసింది. థీమ్ బాగున్నప్పటికీ సపోర్టింగ్ కాస్ట్ ఎంపిక సరిగా లేకపోవడం దర్శకత్వ లోపాల కారణంగా ఆశించిన రేంజ్ లో అవుట్ పుట్ రానప్పటికీ విభిన్నమైన ప్రయత్నం కాబట్టి ఫ్రీగా చూసే క్యాటగిరీలో ది షోలే గర్ల్ ఓ సారి ట్రై చేయొచ్చు