Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ టైమ్‌ మహేష్‌ నమ్రతల లవ్‌ స్టోరీ వారి మాటల్లో..!

By:  Tupaki Desk   |   5 Oct 2021 3:30 AM GMT
ఫస్ట్‌ టైమ్‌ మహేష్‌ నమ్రతల లవ్‌ స్టోరీ వారి మాటల్లో..!
X
టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటీ ఫుల్‌ కపుల్‌ అండ్‌ ఫ్యామిలీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లలో ముందు ఉండే జంట మహేష్‌ బాబు నమ్రత జంట. వీరిద్దరు కలిసి వంశీ అనే సినిమాలో 2000 సంవత్సరంలో నటించారు. ఆ సినిమా ప్లాప్‌ అయ్యింది... కాని ఆ సినిమా వల్ల వీరి జంట ఏర్పడి సూపర్‌ హిట్ అయ్యి 21 ఏళ్లు దాటినా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ అనుబంధం మరో వందేళ్లు అయినా ఇలాగే కొనసాగుతుందని వారిని చూస్తుంటే అనిపిస్తుంది. వంశీ సినిమా షూటింగ్‌ సమయంలో కలిసి వీరిద్దరు అయిదు సంవత్సరాలు ప్రేమించుకుని 2005 లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి మొదట పెద్దలు ఒప్పుకోలేదు అనే వార్తలు వచ్చాయి. కాని ఇద్దరి అన్యోన్యం ముందు ఆ వార్తలు అన్ని కూడా కొట్టుకు పోయాయి. మహేష్‌ బాబు మరియు నమ్రతల ప్రేమ కథ గురించి జనాలు మరియు మీడియా వర్గాల వారు చాలా చాలా చెబుతూ ఉంటారు. కాని ఇప్పటి వరకు వారి నోటి నుండి వారి ప్రేమ కథ మాత్రం వినలేదు.

ఎట్టకేలకు ఒక ప్రముఖ మ్యాగజైన్ కోసం వారు కవర్‌ ఫొటో ఇవ్వడంతో పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇద్దరు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి ప్రేమ విషయాన్ని కూడా వెళ్లడించారు. మహేష్‌ బాబు మాట్లాడుతూ వంశీ సినిమా షూటింగ్‌ సమయంలో మొదటి సారి చూసిన సమయంలోనే ఒకరిని ఒకరు చూసుకున్నాం. ఆ సమయంలో ఎక్కువగా ఒకరిని ఒకరం చూసుకునేవాళ్లం. మేము అయిదు సంవత్సరాల పాటు డేట్‌ లో ఉన్నాం. రెండు ఏళ్ల తర్వాత అది సీరియస్ గా మారింది. అలా మేము పెళ్లికి సిద్దం అయ్యామని మహేష్‌ బాబు చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు పెళ్లికి ముందు ఎలా ఉన్నాడో పెళ్లి తర్వాత కూడా అదే విధంగా ఆమె పట్ల ప్రేమను ఆరాధన భావంను కలిగి ఉన్నాడు.

నమ్రత ఈ విషయం గురించి మాట్లాడుతూ.. మొదటి సారి ఆయన్ను చూసినప్పుడే ప్రత్యేక అనుభూతి కలిగింది. ఒక ఇన్నోసెంట్‌ మరియు విభిన్నమైన వ్యక్తి అని ఆయన గురించి నాకు అనిపించింది. అలాంటి వ్యక్తిని ఎక్కడ కనిపెట్టలేను అనుకున్నాను. అందుకే రెండేళ్ల తర్వాత మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోవాలనుకున్న మూడు ఏళ్ల వరకు వీరు ఇద్దరు ప్రేమలోనే ఉన్నారు. ప్రేమలో అయిదు ఏళ్లు ఉన్న వీరిద్దరు వైవాహిక జీవితంలో 15 ఏళ్లకు పైగా ఉన్నారు. మొత్తంగా వీరి ప్రేమకు రెండు దశాబ్దాలు ముగిసింది. అయినా కూడా ఇద్దరి మద్య ప్రేమ పెరిగింది కాని తగ్గలేదు అనడంలో సందేహం లేదు.

వీరి ప్రేమకు గుర్తుగా అందమైన క్యూట్‌ పిల్లలు గౌతమ్ మరియు సితారలు ఉన్నారు. వీరిద్దరు కూడా సోషల్‌ మీడియా సెన్షేషన్‌. వారిద్దరిని చూస్తే వారి మద్య ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌ స్టాప్ పెట్టిన నమ్రత తన కెరీర్‌ ను త్యాగం చేసి మహేష్‌ బాబుకు వెన్ను దన్నుగా నిలిచింది. ఒక మంచి తల్లిగా కూడా పేరు దక్కించుకుంది. మంచి భార్యగా నిలిచి మహేష్‌ బాబులో ఎన్నో మార్పులను కూడా తెచ్చింది అనేది నెటిజన్స్ కామెంట్స్‌. మహేష్‌ బాబు సినీ మరియు వ్యాపార విషయాల్లో నమ్రత భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. మహేష్‌ బాబు ఈ స్థాయిలో నిలవడంలో ఖచ్చితంగా నమ్రత భాగస్వామ్యం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.