Begin typing your search above and press return to search.

మోనాల్‌ లేకుంటే అఖిల్ ను చూస్తారా?

By:  Tupaki Desk   |   16 April 2021 4:30 PM GMT
మోనాల్‌ లేకుంటే అఖిల్ ను చూస్తారా?
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 జంట అఖిల్‌ మరియు మోనాల్‌ కు మంచి గుర్తింపు దక్కింది. అఖిల్ తో రొమాన్స్ వల్లే మోనాల్‌ అన్ని రోజులు షో లో కొనసాగింది అని చాలా మంది బలమైన నమ్మకం. మోనాల్‌ తో అఖిల్‌ రొమాన్స్ వల్లే మంచి గుర్తింపు దక్కించుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరి జోడీని విడి విడిగా అభిమానులు చూడలేరు. అందుకే వీరిద్దరితో తెలుగు అబ్బాయి.. గుజరాతీ అమ్మాయి అనే వెబ్‌ సిరీస్ ను మొదలు పెట్టారు. తాజాగా అఖిల్‌ ఫస్ట్‌ టైమ్ అనే సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. కాని ఆ సినిమాలో అఖిల్‌ కు జోడీగా నటించేది మోనాల్‌ కాదు. అఖిల్‌ కోసం అనిక విక్రమన్‌ హీరోయిన్ గా నటిస్తుంది.

మోనాల్‌ తో కాకుండా అఖిల్‌ మరో హీరోయిన్ తో నటించబోతున్న నేపథ్యంలో నెటిజన్స్‌ విమర్శలు చేస్తున్నారు. మోనాల్‌ తో చేస్తేనే అఖిల్‌ కు గుర్తింపు.. మీ ఇద్దరి కాంబినేషన్‌ ను మాత్రమే ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మోనాల్‌ తో కాకుండా అఖిల్‌ మరే హీరోయిన్‌ తో చేసినా కూడా ఆ ప్రాజెక్ట్‌ ను జనాలు కనీసం పట్టించుకోక పోవచ్చు అంటున్నారు. మోనాల్‌ వల్లే అఖిల్‌ కు గుర్తింపు.. అలాంటి అఖిల్‌ మరో హీరోయిన్ తో నటిస్తే చూస్తారా అనే విషయాన్నిఫస్ట్‌ టైమ్‌ మూవీ మేకర్స్‌ ఆలోచించాలంటూ కొందరు సూచిస్తున్నారు.

మోనాల్‌ గజ్జర్‌ కాకుండా మరో హీరోయిన్‌ తో నటించడం పట్ల అఖిల్‌ స్పందించాడు. 'ఫస్ట్‌ టైమ్‌' సినిమాలో మోనాల్‌‌ తో కాకుండా మరో హీరోయిన్‌ తో సినిమాను చేయడంను సోషల్‌ మీడియాలో తప్పుబడుతూ అఖిల్‌ పై విమర్శలు చేస్తున్నారు. మోనాల్‌ ను ఎందుకు ఎంపిక చేయలేదు అంటూ కొందరు కోపం తో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆ విమర్శలకు అఖిల్‌ స్పందించాడు. హీరోయిన్‌ ఎంపిక అనేది దర్శకుడి ఇష్టం. ఆయన ఇష్టప్రకారం ఫస్ట్‌ టైమ్‌ సినిమా కు గాను అనిక ను ఎంపిక చేసినట్లుగా క్లారిటీ ఇచ్చాడు. ఎంపిక చేసింది ఎవరైనా అఖిల్‌ తో మోనాల్‌ కాకుండా మరెవ్వరు నటించినా చూస్తారనే నమ్మకం లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.