Begin typing your search above and press return to search.
ఫస్ట్ వీక్ రిపోర్ట్: కలెక్షన్ల సునామీ సృష్టించిన 'ఉప్పెన'
By: Tupaki Desk | 19 Feb 2021 8:10 AM GMTమెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా నటించిన 'ఉప్పెన' సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించాయి. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్ళు రాబట్టింది. హీరోహీరోయిన్ల నటన - విజయ్ సేతుపతి విలనీ - దేవిశ్రీప్రసాద్ సంగీతం వంటి అంశాలు ఈ సినిమా విజయానికి దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో అత్యధిక షేర్ వసూలు చేసిన డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డ్ క్రియేట్ చేసాడు. మొత్తం మీద ఫస్ట్ వీక్ లో 'ఉప్పెన' సినిమా దాదాపు 38 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఉప్పెన' 6వ రోజు 1.93 కోట్ల వసూళ్ళు రాబట్టగా.. 7వ రోజు 1.44 కోట్ల షేర్ అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ వీక్ లో నైజాం ఏరియాలో 11.55 కోట్లు - సీడెడ్ లో 5.60 కోట్లు కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 34.91 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెస్టాప్ ఇండియా - ఓవర్ సీస్ కలిసి 3 కోట్లు వచ్చాయి. అంటే మొదటి వారంలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 37.91 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. 50కోట్ల క్లబ్ లో చేరాలంటే రెండో వారంలో కూడా కలెక్షన్స్ స్టడీగా ఉండాలి. కాకపోతే ఈరోజు నాలుగైదు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవడంతో 'ఉప్పెన' జోరుకు ఇకపై బ్రేకులు పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి మెగా ఉప్పెన వాటికి పోటీగా నిలిచి మరిన్ని డబ్బులు రాబడుతుందేమో చూడాలి.