Begin typing your search above and press return to search.
ఫిష్ వెంకట్.. నిద్ర లేదట పాపం
By: Tupaki Desk | 29 Sep 2015 7:30 AM GMTదాదాపు దశాబ్దంన్నర నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు ఫిష్ వెంకట్. ముందు సీరియస్ పాత్రలు చేశాడు. ఆ తర్వాత కామెడీ క్యారెక్టర్లు చేస్తున్నాడు. కానీ ఏ రోజూ కూడా ఓ సినిమా చూసొచ్చాక జనాలు అతడి గురించి మాట్లాడుకుంది లేదు. కొన్ని సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలే చేశాడు కానీ.. అతడి కామెడీకి ఆ సమయానికి థియేటర్లో ఓ నవ్వి నవ్వి ఊరుకోవడం తప్పితే, థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా అతడి యాక్టింగ్ గురించి, డైలాగుల గురించి గుర్తు చేసుకున్నది లేదు. ఐతే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో మొదటిసారి అలా జరుగుతోంది. విలన్ గ్యాంగులో ఒకడిగా ఉంటూ ఎప్పుడూ ఇంగ్లిష్ లోనే మాట్లాడుతూ వెంకట్ పేల్చిన పంచ్ లకు అద్భుతమైన స్పందన వస్తోంది. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నాడట ఫిష్. ఈ అనుభవం గురించి రావు రమేష్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సక్సెస్ మీట్ లో వెల్లడించాడు.
‘‘సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో అందరూ బాగా చేశారు. ఐతే అందరికంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది మాత్రం ఫిష్ వెంకటే. ఆ పేరు వల్ల అతడి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పాపం సినిమా విడుదలైన రోజు నుంచి అతడికి నిద్రే లేదట పాపం. ఒకటే ఫోన్లు. ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారట. రాత్రి పగలు అని తేడా లేకుండా ఫోన్లు చేసి విష్ చేస్తున్నారట. వరంగల్ నుంచి చేస్తున్నారు.. తిరుపతి నుంచి చేస్తున్నారంటూ అతను చెబుతూ.. నిద్ర లేదని బాధపడుతుంటే చాలా చాలా ఆనందమేసింది. ఇదంతా హరీష్ శంకర్ పుణ్యమే. నాకు కూడా తన సినిమాల్లో అద్భుతమైన పాత్రలు ఇచ్చాడు. అతను సరస్వతీ పుత్రుడు. అలాంటి వాడు మంచి సినిమాలు తీస్తూనే ఉండాలని కోరుకుంటా. అప్పుడే మాలాంటి వాళ్లకు మంచి మంచి పాత్రలు పడతాయి. నేను చేసిన బియ్యం బుజ్జి పాత్రకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని రావు రమేష్ చెప్పాడు.