Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌: మరో కాశ్మీర సుందర కావ్యం

By:  Tupaki Desk   |   4 Jan 2016 1:30 PM GMT
ట్రైలర్ టాక్‌: మరో కాశ్మీర సుందర కావ్యం
X
బాలీవుడ్‌ లో ఈ మధ్యన ఎంతో అందమైన సుందర కావ్యాలు వస్తున్నాయ్‌. అయితే వాటన్నింటికీ బ్యాక్ డ్రాప్‌ కింద కాశ్మీర్‌ అందాలనే ఎంచుకోవడం అనేది ఆనవాయితీగా మారింది. మొన్నటివరకు అసలు కాశ్మీర్‌ లోని మంచు కొండలను వదిలేసి ఫారిన లొకేషన్లపై ఆధారపడిన బాలీవుడ్‌ బాబులు.. ఇప్పుడు వరుసగా అక్కడే కొన్ని సినిమాలను తీయడం గమనార్హం.

ఆ మధ్యన సోనాక్షి సిన్హా, రణవీర్‌ సింగ్‌ జంటగా లుటేరా అనే సినిమా వచ్చింది. ది లాస్ట్‌ లీఫ్‌ అనే షార్ట్‌ ఫిలిం బేస్‌ చేసుకొని ఈ సినిమాను తీశారు. డార్జీలింగ్‌ అని నమ్మిస్తూ సినిమాను ఆద్యంతం కాశ్మీర్‌ లో చిత్రీకరించారు. సినిమా ఫ్లాపైనా క్రిటికల్‌ గా చాలా పేరు తెచ్చకుంది. విశాల్‌ భరద్వాజ్‌ తీసిన హైదర్‌ కూడా అంతే. దీనికీ కాశ్మీరే డైరక్టు బ్యాక్‌ డ్రాప్‌. ఇందులో షాహీద్‌, శ్రద్దా కపూర్‌ లు నటించారు. కాశ్మీర్‌ అందాల మోత, టెర్రరిజం తాలూకు ఛాయలతో.. సినిమా అదిరిపోయింది. క్రిటిక్స్‌ పొగిడేశారు.

ఇప్పుడు కొత్తగా ఫితూర్‌ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా కూడా కాశ్మీర్‌ బ్యాక్‌ డ్రాప్‌. ప్రముఖ నవలా రచయిత చార్లెస్‌ డికెన్స్‌ లండన్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో రాసిన నవలను.. వీరు కాశ్మీర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో.. ఒక ముస్లిం ఫ్యామిలీ నేపథ్యంలో అద్భుతంగా తీశారు. ట్రైలర్‌ అదరిపోయింది. కాశ్మీర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఇలా వరుసగా సినిమాలను చూస్తుంటే.. మన తెలుగోళ్ళు కూడా అక్కడ సినిమాలు తీస్తే బెటర్‌ అనిపిస్తోంది.