Begin typing your search above and press return to search.
టాలీవుడ్ గమనం మార్చిన రెబల్ హీరో
By: Tupaki Desk | 23 Oct 2019 2:30 PM GMTతెలుగు సినిమా దశ - దిశ తిప్పేసిన సినిమాలుగా బాహుబలి1 - బాహుబలి 2 క్రేజు గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆ సినిమాల్ని తెరకెక్కించిన పనిమంతుడు దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి అయినా.. వాటిని విజయవంతమైన సినిమాలుగా ముందుండి నడిపించిన ఫేస్ మాత్రం ప్రభాస్ అనే చెప్పాలి. టాలీవుడ్ దశ దిశ గమనం పూర్తిగా మార్చేసిన ఫ్రాంఛైజీకి ఫేస్ ఆఫ్ ది హీరో ప్రభాస్. ఐదేళ్ల కెరీర్ ని త్యాగం చేసి ఆ రెండు సినిమాల కోసం సమయం కేటాయించే ధైర్యమే అతడిని అంత పెద్ద స్టార్ ని చేసింది. నేడు 100కోట్ల షేర్ సునాయాసంగా అందుకునే సత్తాని ఇచ్చింది ఆ ధైర్యమే.
అందివచ్చిన అవకాశం ఒడిసి పట్టుకుని.. సత్తా చాటిన సూపర్భ్ హీరో ప్రభాస్. ఛాన్స్ వదిలిపెట్టని నైజం ..డేరింగ్ యాటిట్యూడ్ తో ముందుకు సాగిన అతడి మొండితనాన్ని మర్చిపోకూడదు. స్నేహితులతో కలిసి `సాహో` లాంటి పాన్ ఇండియా చిత్రంతో భారీ ప్రయోగమే చేశాడు. ధైర్యంతో పాటు ప్రయోగాలు చేసే యాటిట్యూడ్ డార్లింగ్ కి ఉందని ఈ సందర్భంలో ప్రూవైంది. రెబల్ స్టార్ అన్నందుకు రెబల్ యాటిట్యూడ్ చూపించాడు. నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా తమ ఫేవరెట్ హీరోలోని బెస్ట్ క్వాలిటీస్ గురించి.. రికార్డుల గురించి అభిమానులు స్మరించుకుంటున్నారు.
ప్రభాస్ ని రికార్డుల పరంగా పరిశీలిస్తే.. దేశంలోనే బాహుబలి 2 నంబర్ 1 గ్రాసర్ ఇప్పటికీ. వరుసగా మూడు 100కోట్ల షేర్ క్లబ్ (తెలుగు) సినిమాల్లో నటించిన ఏకైక సౌత్ స్టార్ ప్రభాస్ మాత్రమే. సింగిల్ భాషలో ప్రభాస్ దే అరుదైన రికార్డ్. దేశంలోనే టాప్ 2 ఓపెనర్స్ ప్రభాస్ ఖాతాలోనే నిలిచాయి. బాహుబలి 2.. సాహో చిత్రాలతో ఈ ఫీట్ అందుకున్నాడు. ఇప్పటికీ ఆ రికార్డులు అతడి ఖాతాలో పదిలం. దేశంలో ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. పరమ చెత్త రేటింగులు వచ్చి ఇండియా ఆల్ టైమ్ టాప్ 10 నెట్ సాధించిన సినిమాల జాబితాలో `సాహో` పేరు నంబర్ వన్ గా నిలిచింది. అది ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ కి నిదర్శనం. దేశ.. విదేశాల్లో ప్రభాస్ కి అనూహ్యంగా పెరిగిన మాస్ క్రేజు ఎలా ఉందో చాటి చెప్పిన చిత్రమిది. కేవలం ప్రభాస్ ని.. తనలోని రెబలిజాన్ని చూసేందుకు థియేటర్లకు వచ్చారు జనం. అన్ని పరిశ్రమల్లోనూ ఒకే సినిమాతో ఇండస్ట్రీ హిట్ ల రికార్డుల్ని నెలకొల్పిన ఏకైక స్టార్ ప్రభాస్. ఖాన్ లకే ఈ ఫీట్ సాధ్యం కాలేదు. ప్రభాస్ నటించిన బాహుబలి 2 ఆ ఫీట్ ని అందుకుంది. అన్ని ఇండస్ట్రీల్లో రికార్డుల్ని తిరగరాసింది. నేటి తరం హీరోగా ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమాల వల్లనే తెలుగు సినిమా ఘనత ఇతర ప్రపంచానికి తెలిసింది అనడంలో సందేహం లేదు. మన మార్కెట్ ని ఇరుగు పొరుగున విస్తరించగలిగామంటే ప్రభాస్ డేరింగ్ స్టెప్స్ వల్లనే అని ప్రశంసిస్తే తప్పేమీ కాదు.