Begin typing your search above and press return to search.

ఐశ్వర్య గౌనుకు ఐదుగురు అసిస్టెంట్స్

By:  Tupaki Desk   |   21 May 2017 9:32 AM GMT
ఐశ్వర్య గౌనుకు ఐదుగురు అసిస్టెంట్స్
X
కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ముద్దుగుమ్మలు అందరూ అందాలు ఒలికిస్తూ అటెండ్ అయిపోయారు. ఇక్కడకు చాలామంది భామలే వస్తుంటారు కానీ.. కేన్స్ కి అటెండ్ అయ్యే భామల్లో.. ఐశ్వర్యారాయ్ బచ్చన్ కు అరుదైన గుర్తిపు ఉంది.

గత 16 ఏళ్లుగా కేన్స్ లో సందడి చేస్తూనే ఉది ఐష్. 2017 కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కూడా కొత్త టైపు డ్రెసులో వచ్చేసిందీ భామ. సిండ్రెల్లా పాత్రను రియల్ లైఫ్ లో చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది. నడుం కింద నుంచి తన సైజుకు 10 రోట్లకు పైగా కొలతలతో మరీ డిఫరెంట్ గా ఈ డ్రెస్ డిజైన్ చేశారు. కల్పిత పాత్ర అయిన సిండ్రెల్లా రెడ్ కార్పెట్ పై నడిచినట్లుగా ఉంది ఈ భామ గెటప్. అయితే.. కార్పెట్ పై ఉన్నంత వరకూ బాగానే ఉంది కానీ.. స్టెయిర్ కేస్ ఎక్కాల్సి వచ్చినపడే అసలు సమస్య వచ్చింది.

మెట్లు ఎక్కేటపుడు ఈమెకు.. ఈమె డ్రెస్ ను ఎలాంటి డ్యామేజ్ జరగకుడా ఉండేందుకు.. ఏకంగా ఐదుగురు సహాయం చేయాల్సి వచ్చింది. ఒక్క డ్రెస్ కు ఐదుగురు అసిస్టెంట్స్ అంటే అతిగానే ఉంటుంది కానీ.. ఈ డిజైనర్ డ్రెస్ కి తప్పలేదు. పైగా ఈ డ్రెస్ తో తనకు కేటాయించిన కుర్చీలో కూర్చునేందుకు కూడా వీలుపడలేదు ఐశ్వర్యారాయ్ కి. పాపం కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/