Begin typing your search above and press return to search.
`వర్షం`ని చెత్తగా రీమేక్ చేసారు.. దానికి ఐదేళ్లు!
By: Tupaki Desk | 29 April 2021 10:39 AM GMTడార్లింగ్ ప్రభాస్ - త్రిష జంటగా శోభన్ తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరి `వర్షం`ని హిందీలో భాఘి పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్ అక్కడ కథానాయకుడిగా నటించగా శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించింది.
ఇక గోపిచంద్ బదులుగా హిందీ వెర్షన్ లో సుధీర్ బాబు విలన్ గా నటించారు. ప్రేయసి కోసం టైగర్ వర్సెస్ సుధీర్ బాబు యాక్షన్ ఎపిసోడ్స్ అక్కడ కూడా రక్తి కట్టించాయి. విలన్ గా సుధీర్ బాబు నటనకు గొప్ప పేరొచ్చింది. కానీ క్లాసిక్ వర్షంతో పోలిస్తే భాఘి తేలిపోయిందనేది ప్రభాస్ అభిమానుల విమర్శ. భాఘి బావుంటుంది కానీ వర్షం రేంజులో కానేకాదు! అనేది ఒక వర్గం ఫిర్యాదు.
నిజానికి తెలుగులో వర్షం చిత్రాన్ని అంతే క్లాసిక్ గా మలచడంలో శోభన్ అండ్ టీమ్ కృషి ఎప్పటికీ మరవలేనిది. ఇక్కడ దేవీశ్రీ మ్యూజిక్.. అలాగే పాటలు కూడా చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ప్రభాస్ అద్భుతమైన యాక్షన్ ఫీట్స్.. డైలాగులు.. అలాగే త్రిష అందచందాలు ఎక్స్ ప్రెషన్స్.. గోపిచంద్ విలనీ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. అయితే ఆ స్థాయిలో భాఘి మనవాళ్లకు అనిపించదు. కానీ ఇది హిందీలోనూ మంచి హిట్ చిత్రంగా నిలిచింది.
భాఘి ఈ ఏడాదితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హిందీ రీమేక్ దర్శకుడు షబ్బీర్ ఖాన్ భాఘి విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సినిమాని ఓటీటీల్లో కుటుంబ సమేతంగా వీక్షించమని ఆయన కోరారు. ఇక భాఘి కి సీక్వెల్ గా భాఘి 2 కూడా హిందీలో విడుదలైన సంగతి తెలిసిందే. కానీ తెలుగులో వర్షం చిత్రానికి సీక్వెల్ చేయలేదు.