Begin typing your search above and press return to search.
చిత్రపురి కాలనీలో BRS లీడర్లకు ఫ్లాట్లు?
By: Tupaki Desk | 10 Jan 2023 2:30 PM GMTసినీకార్మికులకూ గూడు నీడ అనే కాన్సెప్టుతో దివంగత నటుడు ప్రభాకర్ రెడ్డి డొనేట్ చేసిన 16 ఎకరాల స్థలం(హైదరాబాద్ గచ్చిబౌళి సమీపం) లో చిత్రపురి కాలనీ ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో సింగిల్ బెడ్ రూమ్స్.. డబుల్ బెడ్ రూమ్స్ సహా ట్రిపుల్ బెడ్ రూమ్ లు విల్లాలు రోప్ హౌస్ లు నిర్మించారు. ఇప్పటికే సింగిల్ బెడ్ రూమ్స్ ట్రిపుల్ బెడ్ రూమ్స్ ఆక్యుపేషన్ కూడా జరిగింది. అయితే వీటిలో బోలెడంత అవినీతి జరిగిందని సినీకార్మికులకు కాకుండా సినీరంగానికి చెందని ఇతరులకు ఫ్లాట్లను చిత్రపురి కమిటీలు అమ్మేశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. భారీగా బిజినెస్ సాగిందన్న ఆరోపణలపై పలుమార్లు విచారణ కూడా సాగింది.
చిత్రపురి కాలనీ అవినీతి సిత్రాలపై హైకోర్టులోను విచారణ జరిగింది. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆర్డర్ జారీ చేసింది. అలాట్మెంట్ లో లేని రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని స్పష్టం చేసింది. దీంతో సుమారు వెయ్యి రిజిస్ట్రేషన్లు రద్దు అయ్యే అవకాశం ఉందని కూడా కథనాలొచ్చాయి. కోర్టు తీర్పును కూడా అక్రమార్కులకు అవినీతి అధికారులు ఉల్లంఘించారని కూడా ఆరోపించారు.
దీనిపై సోషల్ యాక్టివిస్టు భద్రతో కలిసి పలువురు సినీకార్మికులు ధర్నాలు చేస్తున్నారు. చిత్రపురి అవినీతి భోగోతంపై హైకోర్టులో సైతం విచారణ సాగింది. కోర్టులు ఎన్ని తీర్పులిచ్చినా కానీ అధికారులు స్పందించడం లేదని కూడా వారు ఆరోపించారు.
తాజాగా పలువురు యాక్టివిస్టులు ఉద్యమకారులు చిత్రపురి కాలనీ అవినీతిలో బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఎక్కువగా ఉన్నారని ఆరోపించడం సంచలనమైంది. ఇందులో బి.ఆర్.ఎస్ నాయకులైన వి ప్రకాష్ - రసమయి బాలకృష్ణ లకు - హమబూబ్ నగర్ ఎంఎల్ ఏ క్రాంతి కుమార్ కి .. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తండ్రి గారికి ఫ్లాట్లు ఉన్నాయని తాజాగా ఒక మీడియా కథనం వెలువడింది.
చిత్రపురిలో 75 శాతం విల్లాల్లో ఔటర్లే ఉన్నారనేది సదరు కథనం సారాంశం. క్రాంతి కుమార్ .. బొంతులకు హెచ్ ఐజీ లో ట్రిపుల్ బెడ్ రూమ్స్ ఉన్నాయి. రసమయికి విల్లా ఉంది. రోషయ్య పీఏకి కూడా ఇక్కడ ఫ్టాట్ ఉంది. రోషయ్య గారి పీఏ నే ఇక్కడ కథంతా నడిపించిన వ్యక్తి అని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.
మళ్లీ డబుల్ బెడ్ రూమ్స్ కడతాం. మొత్తం అమ్ముకుంటాం.. కమర్షియల్ చేస్తామని అంటున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే నాశనమవుతామని పలువురు ఉద్యమకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం చర్చగా మారింది.
దివంగత నటుడు ప్రభాకర్ రెడ్డి తన భూములన్నిటినీ (సుమారు 16 ఎకరాలు) సినీకార్మికుల సొంత ఇంటి నిర్మాణం కోసం దానమిచ్చారు. దివంగత లెజెండ్స్ డా.దాసరి నారాయణ రావు-డా.డి.రామానాయుడు .. నాటి కాంగ్రెస్ నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారు చిత్రపురి కాలనీని ప్రారంభిస్తే ఇప్పుడు నీచులు వ్యాపారం చేస్తున్నారని ఉద్యమకారులు ఆరోపించారు.
ఈ అవినీతిపరులు చిరంజీవి పేరును కూడా లాగుతున్నారని తెలిపారు. చిరంజీవి గారిని కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ .. తమ వెనక అంతా ఆయనే ఉన్నారని చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనీల్ కుమార్ ప్రచారం చేసుకుంటున్నారని సదరు ఉద్యమకారుడు ఆరోపించారు. కమిటీ అధ్యక్షుడు నీచుడు. మొత్తానికి కథానాయకుడు అతడే. ఆయన మాటలు నమ్మొద్దు! అని ఆయన ఆరోపించారు. చిత్రపురిలో అవినీతికి పాల్పడమని చిరంజీవి గారు చెప్పారా? చిరుకి భారతరత్న రావాలని కోరుకున్న అభిమానులం మేమంతా. ఆయన పేరును దీనిలోకి లాగడం సరికాదు... అని అన్నారు.
29 జనవరి 2023న డబుల్ కొత్తగా బెడ్ రూమ్ స్కీమ్ ని ప్రారంభించాలనుకుంటున్న కేటీఆర్ గారికి 1500 ఫ్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలియదా? అని సదరు మీడియా ప్రశ్నించగా.. ఇవన్నీ మంత్రి కేటీఆర్ కి బి.ఆర్.ఎస్ అధినాయకులకు తెలియకుండా జరగలేదని కూడా వెల్లడించారు. ఏడాది క్రితం మసాబ్ ట్యాంక్ క్యాంప్ కార్యాలయంలో తెరాస అధినాయకుడు మంత్రి కేటీఆర్ ని కలిసానని దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని వెళ్లిపో అని అన్నారని కూడా ఒక ఉద్యమకారుడు ఆరోపించారు. నేను నా భార్య కలిసి వెళ్లాం.. నేను టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ని.. పదిహేనేళ్లుగా పని చేస్తున్నాను! అని అన్నారు. మొత్తం బందిపోట్లు రక్తం తాగే నీచులు ఇక్కడ తయారయ్యారు.
కేటీఆర్ గారు మీ మామ గారిని కూడా చిత్రపురి కాలనీ అవినీతిలోకి లాగారని ఆయన ఇప్పుడు కాలం చేశాక ఆరోపణలున్నాయని ఉద్యమకారులు విమర్శించారు.
నిజమైన సినీకార్మికులారా మూడు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. మాపై ఆరు అక్రమ కేసులు పెట్టారు. కళామతల్లి బిడ్డల్లారా కళ్లు తెరవండి. చంపేస్తామని అంటున్నారు! అంటూ తీవ్రంగా ఆరోపించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.