Begin typing your search above and press return to search.
అసలు రహస్యం ఇదా రాక్షసా ?
By: Tupaki Desk | 13 April 2019 4:57 AM GMTభారీ సినిమాలు టాప్ రేంజ్ డిమాండ్ ఉన్న హీరోయిన్లు కోట్లు మంచి నీళ్లలా ఖర్చు పెట్టే నిర్మాతలు ఉంటే తప్ప ఇప్పటిదాకా సినిమా చేయని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో అత్యంత వేగంగా పూర్తవుతున్న సినిమాగా రాక్షసుడు రికార్డు సెట్ చేసేలా ఉంది. కేవలం నెల రోజులు లేదా మహా అంటే నలభై వర్కింగ్ డేస్ లో మొత్తం షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేశారట. బిజినెస్ డీల్స్ కూడా సుమారు 20 కోట్ల దాకా అభిషేక్ సంస్థ కొనేసినట్టు టాక్ ఉంది.
అయితే ఇంత సులువుగా ఎలా పూర్తి చేస్తారనే అనుమానం రావొచ్చు కదా. దాని వెనుక అసలు రహస్యం వేరే ఉంది. రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ రట్ససన్ లో సినిమా మొత్తం హీరో ఉండడు. కీలకమైన కొన్ని ఎపిసోడ్స్ లో అతని అవసరం లేకుండానే జరిగిపోతాయి.ఇప్పుడివన్నీ అలాగే ఉంచేసి సాయి శ్రీనివాస్ కాంబోలో వచ్చే సీన్స్ ని మాత్రమే రీ షూట్ చేస్తారట. ఇది చాలా ఈజీ . తమిళ సినిమా చూసిన వారికి ఇది అర్థమవుతుంది.
ఇదేమి కొత్త ప్రక్రియ కాదు. డబ్బింగ్ చేసేటప్పుడు అక్కడి ఆర్టిస్టులు మనకు కనెక్ట్ కారు అనుకున్నప్పుడు వాళ్ళు ఉండే సన్నివేశాలు మనవాళ్ళతో తీసి మిగిలినవి ఇక్కడ రీ షూట్ చేస్తారు. ఫైనల్ గా మొత్తం స్ట్రెయిట్ సినిమా చూస్తున్నామని ఫీలింగ్ రప్పించడం కోసమే. ఇప్పుడు రాక్షసుడు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. రేపిస్ట్ టీచర్ స్కూల్ ఎపిసోడ్-సైకో కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ లాంటివన్నీ అలాగే ఉంచేస్తారని ఫిలిం నగర్ టాక్. ఈ లెక్కన దర్శకుడు రమేష్ వర్మకు సగం భారం తగ్గినట్టే