Begin typing your search above and press return to search.
ఫ్లాప్ బ్యూటీస్ మూడు ముక్కలాట!
By: Tupaki Desk | 16 April 2019 5:15 AM GMTఒకే పరిశ్రమలో కెరీర్ పరంగా రాణించడం అంటే అంత ఆషామాషీ కాదు. సుదీర్ఘ కాలం ఒకే మైలేజ్ అందరికీ కుదరదు. ఒకచోట దుకాణ్ బంద్! అన్న సందేహం రాగానే ఇంకో చోట కెరీర్ ని వెతుక్కోవాలి. అలా కాక ముందే దీపం ఉండగానే హిట్లతో జోరు మీద ఉండగానే ఇరుగు పొరుగు పరిశ్రమల్లోనూ ప్రయత్నాలు చేస్తూ అక్కడో సినిమా ఇక్కడో సినిమా అన్న చందంగా ప్లాన్ చేసే తెలివైన నాయికలు ఉన్నారు. మన ముద్దుగుమ్మలంతా తెలుగులో నటిస్తూనే తమిళం.. హిందీ.. ఇతర పరిశ్రమల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నించడం చూస్తున్నదే. పూర్తిగా ఫ్లాపులు ఇబ్బంది పెడితే బాలీవుడ్ కి వెళ్లిన భామలు ఉన్నారు.
అలాంటి కేటగిరీలో అందాల తాప్సీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తాప్సీ కెరీర్ టాలీవుడ్ లో బిగ్ ఫ్లాప్. తెలుగు, తమిళంలో ఆశించిన కెరీర్ దక్కలేదు. దాంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. నార్త్ లో పెద్ద స్థాయిలో క్లిక్కయ్యింది. పింక్, బేబి, జుడ్వా 2, నామ్ షబానా, మన్మార్జియాన్ .. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లు దక్కాయి. హిట్టును మించి నటిగా తనకు గుర్తింపును తెచ్చాయి. అక్కడ సక్సెసయ్యాక తిరిగి సౌత్ లోనూ అడపాదడపా సినిమాలతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తోంది. సౌత్ లో చాలా కాలం పాటు ప్రయత్నించి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించినా ఆశించిన స్టార్ డమ్ అందుకోలేక చతికిలబడిన భామల్లో ప్రణీత పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ బ్యూటీ `అత్తారింటికి దారేది` లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో నటించినా సరైన అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో `బూట్స్` అనే చిత్రంతో అదృష్టం పరీక్షించుకుంటోంది. ఇండో పాక్ వార్ నేపథ్యంలోని ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, పరిణితి చోప్రా లాంటి స్టార్లతో కలిసి నటించడం ఆసక్తికరం. తెలుగులో `వినాయకుడు` లాంటి హిట్ చిత్రంతో వెలుగులోకి వచ్చిన పూనమ్ కౌర్ అటుపై ఏడెనిమిదేళ్లు పైగానే కెరీర్ ని కొనసాగించింది. కానీ స్టార్ గా తనకు ఏమాత్రం ఇమేజ్ దక్కలేదు. దాంతో తమిళం, బాలీవుడ్ లోనూ ప్రయత్నించింది. ప్రస్తుతం తెలుగులో ఓ టీవీ సిరీస్ తో బిజీగా ఉన్న పూనమ్ కౌర్.. బాలీవుడ్ లో కరణ్ సింగ్ గ్రోవర్ (బిపాసా హబ్బీ) సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. గెస్ట్ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నా అది రిలీజ్ కి రాలేదు.
నవతరం కథానాయిక మేఘ ఆకాష్ నితిన్ సరసన రెండు సినిమాల్లో నటించింది. కానీ ఏదీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ క్రమంలోనే తమిళం, హిందీ పరిశ్రమల వైపు దృష్టి సారించింది. ఇటీవలే పేట చిత్రంలో కనిపించిన మేఘ తమిళంలో వేరొక క్రేజీ సినిమాలో నటిస్తోంది. `శాటిలైట్ శంకర్` అనే హిందీ మూవీలోనూ నాయికగా అవకాశం అందుకుంది. సూరజ్ పాంచోళి ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. అందాల కథానాయిక రెజీన కెరీర్ టాలీవుడ్ లో ఆశించినంత లేదు. ఆ క్రమంలోనే మాతృపరిశ్రమ కోలీవుడ్ లో నటిస్తూ బిజీగా ఉంది. తదుపరి బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. తెలుగమ్మాయి అర్చన ఇక్కడ ఆశించినంత వెలగక పోవడంతో గతంలో బాలీవుడ్ లో జాకీ ష్రాప్ సినిమాలో నటించింది. అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే ప్రస్తుతం తెలుగు - తమిళంలో అడపాదడపా అవకాశాలు అందుకుంటోంది. ప్రీతి శెట్టి పేరుతో ముంబై పరిశ్రమలోనూ తనవంతు ప్రయత్నాల్లో ఉందిట. బాలీవుడ్ లో పరేష్ రావల్ వారసుడు ఆదిత్య డెబ్యూ మూవీ `బన్ ఫర్` అనే చిత్రంలో అవకాశం అందుకుంది. కృతి కర్భంద `తీన్ మార్` లాంటి చిత్రంలో నటించినా టాలీవుడ్ లో ఆశించిన స్టార్ డమ్ దక్కలేదు. దాంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడే చాలాకాలంగా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ బిజీగా ఉంది. వీళ్లే కాదు.. సౌత్ లో ఆశించిన కెరీర్ దక్కకపోతే ముంబై పరిశ్రమలో అవకాశాలు వెతుక్కునే సౌత్ నాయికలెందరో. అయితే అక్కడ నెగ్గు కొచ్చే ఛాన్స్ తాప్సీలా ఎవరికో ఎప్పటికో కానీ దక్కదు.