Begin typing your search above and press return to search.
క్యూబ్ ఖర్చులు అయినా తేగలడా?
By: Tupaki Desk | 26 Jun 2019 11:04 AM GMTఆ హీరోకి వరుసగా అన్నీ ఫ్లాపులే. కనీసం క్యూబ్ రేట్లు కూడా గిట్టుబాటు కాలేదని గతంలో బయ్యర్లు లబోదిబోమన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. అతడు నటించిన అరడజను పైగా డబ్బింగ్ సినిమాల సన్నివేశం ఇదే. అయినా ప్రతిసారీ అతడు నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతూనే ఉన్నాయి. రిలీజవుతూనే ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పి ఎంతోకొంతకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తున్నారు. తీరా రిలీజయ్యాక మాత్రం పంపిణీ వర్గాల్లో నష్టాల గురించి మొరపెట్టుకునే సన్నివేశం కనిపిస్తోంది.
ఇన్ని వైఫల్యాలు ఎదురైనా.. ఇంకా ఆ హీరో సినిమాలు తెలుగులోకి అనువాదమై వస్తూనే ఉన్నాయి. తాజాగా సదరు హీరో నటించిన ఓ సినిమా సైలెంటుగా రిలీజైపోయింది. అసలు ఈ సినిమా వస్తోంది! అన్న కనీస ఇంటిమేషన్ కూడా లేదు. మీడియా ప్రమోషన్ అసలే లేదు. అయినా థియేటర్లలోకి వచ్చింది. అదొక్కటేనా ఈ సినిమా ఇలా రిలీజైందో లేదో అలా పెద్ద హిట్టయిపోయింది!! అంటూ ఊదరగొట్టుడు ప్రచారం కూడా చేసేసారు. సక్సెస్ మీట్ పేరుతో నేడు ప్రెస్ మీట్ ని పెట్టారు. ``ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా విడుదల చేశాం. దాదాపు నైజాం ఏరియాలో 300 థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అడవిలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ చిత్రాన్ని తీశాం. తెలుగు - తమిళ ప్రేక్షకులు ఆకష్టానికి ఫలితంగా మంచి విజయాన్ని అందించారు`` అంటూ ప్రచారం హోరెత్తించారు. అయితే అసలు విడుదలైందో లేదో కూడా జనాలకు సరిగా తెలీని సినిమా సక్సెసైందంటే నమ్మాలా? అంటూ వేదిక వద్దనే మీడియాలో ఆసక్తికర చర్చ సాగింది. గత సినిమాలు కనీసం క్యూబ్ కోసం ఖర్చు చేసిందైనా తేలేదు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనేస్తున్నారు! అంటూ సెటైర్లు పడిపోతున్నాయ్.