Begin typing your search above and press return to search.
ఒక్క ఫ్లాపు కెరీర్ నే మారుస్తోంది!
By: Tupaki Desk | 12 Sep 2019 5:45 AM GMTఒకప్పుడు అంటే ముప్పై నలభై ఏళ్ళ వెనుక కమర్షియల్ దర్శకుడికి ఒకటో రెండో ఫ్లాప్స్ వస్తే అదేమీ పెద్ద సమస్యగా ఉండేది కాదు. హీరోలు ఆఫర్స్ ఇచ్చే విషయంలో ఆలోచన చేసేవారు కాదు. దాసరి - రాఘవేంద్ర రావు - కోదండరామిరెడ్డి - కోడి రామకృష్ణ లాంటి అగ్ర దర్శకులు వందల సినిమాలు చేశారంటే ఇదే ప్రధాన కారణం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక్క డిజాస్టర్ జూనియర్ సీనియర్ అనే తేడా లేకుండా డైరెక్టర్ల కెరీర్ ను సమూలంగా శాశిస్తోంది.
ఒక డిజాస్టర్ తాలూకు ప్రభావం నుంచి బయటపడటం అంత ఈజీగా లేదు. కొందరైతే డైరెక్షన్ కు దండం పెట్టేసి నటులుగా సైతం మారిపోతున్నారు. వివి వినాయక్ మీద ఇలాంటి కామెంట్సే ఉన్నాయి. ఇంటెలిజెంట్ రిజల్ట్ దెబ్బకు ఆయన కొంత గ్యాప్ తీసుకుని ఫుల్ లెన్త్ రోల్ లో తనే హీరోగా వేరే దర్శకుడి సినిమా ద్వారా నటుడిగా పరిచయమవుతున్నారు. డైరెక్టర్ గా ఆఫర్స్ ఉన్నప్పటికీ ఎందుకో తరుణ్ భాస్కర్ సైతం యాక్టింగ్ మీద ఫోకస్ పెడుతున్నాడు
ఇక బోయపాటి శీను మీద వినయ విధేయ రామ ఇచ్చిన ఎఫెక్ట్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, రామ్ చరణ్ ఎన్నడూ లేనిదీ దీని ఫలితం మీద లెటర్ రూపంలో పబ్లిక్ గా సారీ చెప్పాడు. ఆ తర్వాత బాలకృష్ణతో బోయపాటి ప్లాన్ చేసుకున్న భారీ సినిమా పెండింగ్ లో పడిపోయింది. ఒకవేళ వినయ విధేయ రామ్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఇది ఖచ్చితంగా పట్టాలెక్కేది. కానీ దాని స్థానంలో బాలయ్య కెఎస్ రవికుమార్ కు ఎస్ చెప్పాడు. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది. ఒకప్పుడు అభిమానించిన దర్శకులే అయినా తమను మెప్పించేలా తీయలేకపోతే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ వాటికి ఉదాహరణలే.