Begin typing your search above and press return to search.

అప్పుడే బిగి సడలితే ఎలా పాయలూ..?

By:  Tupaki Desk   |   24 Feb 2020 5:35 AM GMT
అప్పుడే బిగి సడలితే ఎలా పాయలూ..?
X
తొలి సినిమాతోనే హిట్ సాధించడం.. భారీ గుర్తింపు దక్కించుకోవడం అంత సులువేమీ కాదు. చాలా తక్కువ మంది అదృష్టవంతులకే అలా జరుగుతుంది. 'RX100' సినిమాతో కార్తికేయ.. పాయల్ రాజ్ పుత్.. డైరెక్టర్ అజయ్ భూపతి అందరికీ ఒకేసారి హిట్ దక్కింది. పాయల్ మరీ చెలరేగిపోవడంతో బోల్డ్ హీరోయిన్ అనే టాగ్ కూడా తెచ్చుకుంది. మొదటి సినిమానే హిట్ కావడంతో ఆఫర్లు కూడా వెల్లువలా వచ్చిపడ్డాయి. అయితే అవన్నీ నిరాశ పరిచాయి. పోయినేడాది చివర్లో విడుదలైన 'వెంకీమామ' పాయల్ కు రిలీఫ్ ఇచ్చింది.

సినిమాల సంగతి ఇలా ఉంటే పాయల్ సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పెంచుకుంటోంది. ఇక షాప్ ఓపెనింగులు గట్రా ఎలాగూ ఉన్నాయి కాబట్టి రెండు చేతులా సంపాదిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ పాయల్ కు ఈమధ్య ఫిట్నెస్ పై ధ్యాస తగ్గిందని జోరుగా టాక్ వినిపిస్తోంది. సంపాదనలో పడిపోవడంతో గ్లామర్ పై ఫోకస్ తగ్గించిందని అంటున్నారు. ఇదేమీ ఉబుసుపోక సోషల్ మీడియా రచ్చబండ దగ్గర కూర్చుని చేసే పనిలేని అంతర్జాల ఆసాములు చేసే పసలేని ఆరోపణలు కాదు. వారు దీనికి రుజువులు కూడా చూపిస్తున్నారు. ఈమధ్య పాయల్ ఒక హాట్ డ్రెస్ లో ఫోటోకు పోజిచ్చింది. ఆ ఫోటోను పరిశీలనగా చూస్తే ఎవరికైనా వారు చెప్పేది నిజమని అర్థం అవుతుంది. కొన్నిటిని చెప్పీ చెప్పనట్టుగా చెప్తేనే అందం. కాబట్టి ఎక్కువ వివరణ అవసరం లేకుండా ఫోటోను చూసేసి ఎక్కడ తేడా కొట్టిందో అర్థం చేసుకోండి.

ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి.. ఫిట్ గా ఉన్నప్పడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా చెల్లుతుంది. అలా లేనప్పుడు కొన్ని డ్రెస్సులను ధరించకుండా ఉంటే ఈ ఇబ్బందులను తప్పించుకోవచ్చు. అయినా పాయల్ ఉండేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి గ్లామర్ పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని నెటిజెన్లు సలహాలు ఇస్తున్నారు. ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే పాయల్ ప్రస్తుతం 'ఏంజెల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.