Begin typing your search above and press return to search.
ఆమె ఏడ్చి మొత్తుకున్న వారు మాత్రం మౌనమే
By: Tupaki Desk | 8 March 2021 11:30 PM GMTనాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా లోని సారంగదరియా సాంగ్ సోషల్ మీడియాలో సెన్షేషన్ ను క్రియేట్ చేస్తుంది. ఒక వైపు పాటకు ప్రశంసలు దక్కుతుంటే మరో వైపు మాత్రం వివాదాస్పదం అవుతోంది.
జానపద గాయిని కోమలి సారంగదరియా సాంగ్ తనది అంటూ మీడియాకు ఎక్కింది. ఆ మీడియా ఈ మీడియా అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఆమె సారంగదరియా సాంగ్ గురించి ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఎవరు కూడా ఈ పాట గురించి స్పందించక పోవడం చర్చనీయాంశం అవుతోంది.
సారంగదరియా సాంగ్ ను రచించిన సుద్దాల అశోక్ తేజ మాత్రమే ఇప్పటి వరకు కోమలి విమర్శలకు స్పందించాడు. ఆ పాట ఒక్కరి సొత్తు కాదని దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు. దీనిని కోమలి వివాదాస్పదం చేయడం సబబు కాదు అంటూ ఈ సందర్బంగా సుద్దాల అశోక్ తేజ అంటున్నాడు. కాని ఇప్పటి వరకు దర్శకుడు శేఖర్ కమ్ముల మరియు చిత్ర నిర్మాతలు లేదా హీరో ఎవరు కూడా స్పందించలేదు.
ఇప్పటికే ఈ సినిమా వివాదం పీక్స్ పోయిన నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించి కోమలితో మాట్లాడి ఆమె ను శాంతింపజేయాలంటూ కొందరు నెటిజన్స్ అంటున్నారు. మరి కొందరు మాత్రం పబ్లిసిటీ కోసం కొందరి ప్రొద్బలంతో కోమలి చేస్తున్న ఆరోపరణలకు దర్శకుడు శేఖర్ కమ్ముల కాని ఇతర యూనిట్ సభ్యులు కాని స్పందించాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.