Begin typing your search above and press return to search.
'యోగ్ నిద్ర' లో రకుల్.. మహమ్మారి ఒత్తిడిని అధిగమించడానికే ఇలా..!
By: Tupaki Desk | 26 May 2021 3:30 PM GMTసోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ముందుంటారు. నిత్యం అభిమానులతో టచ్ లో ఉండే రకుల్.. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటుగా వ్యక్తిగత వివరాలు కూడా పంచుకుంటుంది. ఫోటోలు - వర్కౌట్ వీడియోలే కాకుండా.. నలుగురుకీ ఉపయోగపడే విషయాలను షేర్ చేస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో జాగ్రత్తలు చెబుతూ వస్తున్న రకుల్.. ఇప్పుడు పాండమిక్ టైంలో ఆందోళన మరియు ఒత్తిడిని అధిగమించడానికి టిప్స్ ఇస్తోంది.
తాజాగా రకూల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో ఆమె జిమ్ లో ఫ్లోర్ మీద పడుకొని కళ్ళు మూసుకుని, చేతులు చాచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. "నేను నిద్ర పోవడం లేదు. నా వెల్నెస్ ఎక్సపర్ట్ మున్ మున్ గనేరివాల్ సూచించినట్లు, వ్యాయామం తర్వాత యోగ్ నిద్ర సెషన్ లో నేను ఈ విధంగా విశ్రాంతి తీసుకుంటాను. పాండమిక్ ఆందోళన మీకు నిద్ర లేకుండా చేస్తున్నా.. ఒత్తిడికి గురిచేస్తున్నా లేదా కోవిడ్ నుంచి మీరు కోలుకుంటున్నా ఆమె మీకు యోగ్ నిద్ర చేయమని సలహా ఇస్తుంది. #everydaypostworkout'' అని రకుల్ ప్రీత్ రాసుకొచ్చింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. రకుల్ హీరోయిన్ గా నటించిన 'సర్దార్ కా గ్రాండ్ సన్' ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాశ్వీ నాయర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటించగా.. నీనా గుప్తా కీలక పాత్ర పోషించారు. తెలుగులో రకుల్ ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్న 'ఎటాక్' సినిమా చేస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ - అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'మే డే' సినిమాలలో రకుల్ కీలక పాత్ర పోషిస్తోంది.