Begin typing your search above and press return to search.

సమంతకు ఇష్టమైనది.. సెక్స్!!

By:  Tupaki Desk   |   14 July 2017 4:16 PM GMT
సమంతకు ఇష్టమైనది.. సెక్స్!!
X
సమంత రీసెంట్ గా JFW (జస్ట్ ఫర్ ఉమెన్) మేగజైన్ కోసం కవర్ పేజ్ ఫోటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో షూట్ కోసం సమంత చాలానే అందాలు ధారపోసింది. అక్కినేని ఫ్యామిలీకి కాబోయే కోడలు అయిన సమంత.. ఇలా అందాల ప్రదర్శన చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. సమంత తన స్టైలింగ్ తో ఇచ్చిన స్టేట్ మెంట్ కొంతమందికి మాత్రం బాగానే అర్ధం అయింది.

ఈ ఫోటో షూట్ లో భాగంగా సమంతను స్పెషల్ గా ఇంటర్వ్యూ చేయడమే కాదు.. అంతకంటే స్పెషల్ గా క్వశ్చన్ చేశారు. 'ఫుడ్.. సెక్స్.. వీటిలో దేన్ని ఎంచుకుంటారు' అనే ప్రశ్న సమంతకు ఎదురైంది. సహజంగా ఇలాంటి వాటికి డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఇక్కడున్నది 'అఆ'లు నేర్పించేసిన భామ. అందుకే 'డిఫికల్ట్' అంటూ ఆశ్చర్యంగా విసుక్కున్నా.. 'సెక్స్' అంటూ స్ట్రెయిట్ ఆన్సర్ ఇచ్చేసింది సమంత. అంతే కాదు.. 'తిండి లేకుండా ఉండగలనులే' అంటూ అందరూ ఆశ్చర్యపోయే ఆన్సర్ ఇచ్చింది సమంత.

ఇక కాబోయే భర్త చైతు గురించి బోలెడన్ని కబుర్లు చెప్పిన సామ్.. తనలో ఉండే నిలకడ బాగా ఇష్టమని చెప్పడమే కాదు.. అసలు చైతులో నచ్చని ఏ గుణం లేదని.. తను పర్ఫెక్ట్ అని చెప్పేస్తోంది. తన బ్యాగులో ఎప్పుడూ ఓ నోట్ బుక్.. పెర్ ఫ్యూమ్.. లిప్ స్టిక్.. వాలెట్.. సెల్ ఫోన్ ఉంటాయని చెప్పిన సమంత.. చైతు ఇచ్చిన ఓ బ్యాగ్ తనకు బాగా ఇష్టం అంటోంది. కాకపోతే.. కాస్ట్లీ బ్యాగ్ పై స్కెచ్ పెన్ తో రాసి ఇస్తాడట చైతు. కానీ తను ఇవ్వాలనుకున్న మెసేజ్ చాలా వాల్యుబుల్ అంటోంది కాబోయే అక్కినేని ఇంటి కోడలు.