Begin typing your search above and press return to search.

డ‌బ్బులు కోసం పెళ్లిళ్లు...పార్టీల్లో డాన్సులు చేయ‌లేదు: కంగ‌న‌!

By:  Tupaki Desk   |   23 Dec 2022 11:35 AM GMT
డ‌బ్బులు కోసం పెళ్లిళ్లు...పార్టీల్లో డాన్సులు చేయ‌లేదు: కంగ‌న‌!
X
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ ఫైరింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ గాళ్ తోవ్య‌వ‌హారమంటే డైరెక్ట్ గానే ఉంటుంది. వివాదం మొద‌లైన త‌ర్వాత అమ్మ‌డు ఎవ‌రినైనా టార్గెట్ చేసిందంటే? వాళ్ల అంతు చూసే వ‌ర‌కూ వ‌దిలిపెట్ట‌దు. వ్య‌వ‌హారం ఎంత దూరం వెళ్లినా త‌గ్గే ప్ర‌శ‌క్తే ఉండ‌దు. సంగ‌తేంటే తేలో వ‌ర‌కూ విడిచి పెట్ట‌దు. ప్ర‌త్య‌ర్ధి ఎంత‌టి శ‌క్తివంత‌మైన వారైనా స‌రే కంగన బాణాలు సూటిగా దిగాల్సిందే. తాజాగా కంగ‌న త‌న వ్య‌క్తిత్వాన్ని రివీల్ చేసేలో ఓ వీడియో షేర్ చేసి తానేంటో ప్ర‌పంచానికి చెప్పే ప్ర‌య‌త్నంచేసింది.

కంగనా రనౌత్ 'క్వీన్' మూవీతో పాటు ఆమె నటించిన కొన్ని సినిమాల్లో ప‌లు పార్టీ సాంగ్స్ ఉన్నాయి. అలాగే పలు మ్యారేజెస్, ప్రైవేట్ పార్టీస్‌లో డ్యాన్స్ చేసేందుకు తనకు ఊహించనంత డబ్బు ఆఫర్ చేసినప్పటికీ రిజెక్ట్ చేసినట్లు చెప్పింది. ఇదే విషయంపై ప్రముఖ సింగర్ ఆశా భోంస్లే .. తన సోదరి.. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ వెల్లడించిన ఒపీనియన్‌పై త్రో బ్యాక్ వీడియోను షేర్ చేసింది కంగన.

ఓ రియాలిటీ షోలో ఆశా భోంస్లే మాట్లాడిన వీడియో క్లిప్ ని షేర్ చేస్తూ.. 'మీరు చెప్పిన మాటలకు అంగీకరిస్తున్నాను. నేను కూడా పెళ్లిళ్లు .. ప్రైవేట్ పార్టీల్లో ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు. నా సినిమాల్లో మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఉన్నప్పటికీ.. భారీ అమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించాను. ప్రస్తుతం ఈ వీడియో చూసినందుకు సంతోషిస్తున్నాను.. లతాజీ మీరు నిజంగా ఇన్‌స్పైర్ చేశారు’ అని తెలిపింది.

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌కు అప్ప‌ట్లో పెళ్లిలో పాట‌లు పాడేందుకు మిలియన్ డాలర్లు ఆఫర్లు చేసినా ఎలా తిరస్కరిం చింది? అనే విషయం గురించి మాట్లాడింది. తమ పెళ్లిలో కేవలం రెండు గంటలు పాడేందుకు 5 మిలియన్ డాలర్లు ఆఫర్లు ఇచ్చినా తిరస్కరించింద'ని తెలిపింది. కంగ‌న సినిమాల సంగ‌తి చూస్తే ప్ర‌స్తుతం అమ్మ‌డు 'ఎమ‌ర్జెన్సీ' చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే ఇందిర ఆహార్యంలో కంగ‌న ఒదిగిపోయిన వైనం సినిమాపై అంచ‌నాలు పెంచేస్తోన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.