Begin typing your search above and press return to search.
క్షణం తీరిక లేకపోయినా చెర్రీ కోసం..!
By: Tupaki Desk | 24 Jan 2021 7:30 AM GMTఓవైపు ఊపిరిసలపని షెడ్యూళ్లతో కుస్తీలు పడుతూనే తన ఫేవరెట్ (మిస్సయిన హీరోల్లో) హీరో సరసన ఆఫర్ రాగానే ఓకే చెప్పేందుకు మార్గాలు వెతుకుతోందట. ఇప్పటికే తన కాల్షీట్లు అన్నీ ఏడాదికి సరిపడా బ్లాక్ అయినా.. అందులో కూడా సర్ధుబాటుకు ఆస్కారం ఉందా లేదా అని తరచి చూస్తోందట.
అంతగా బుట్టబొమ్మను ప్రభావితం చేసిన ఆ మెగా హీరో ఎవరు? అంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 2020 బ్లాక్ బస్టర్ `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించే క్రమంలోనే చరణ్ సరసన ఆచార్యలో పూజా హెగ్డే నటిస్తుందని ప్రచారం సాగింది. కానీ అప్పట్లో దానిపై పూర్తి క్లారిటీ రాలేదు. క్రైసిస్ అనంతరం ఆచార్య షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీంతో పూర్తి క్లారిటీగా ప్రతిదీ సాగిపోతున్నాయి. ఆచార్య మూవీలో 35-40 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో చరణ్ నటిస్తారు. అతడి సరసన నాయికగా పూజాని మరోసారి సంప్రదించారని.. అయితే కాల్షీట్ల సమస్య ఉన్నా సర్ధుబాటు చేసేందుకు ఆలోచిస్తోందని తెలుస్తోంది.
ఇప్పటికే ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నాయికగా నటిస్తోంది. ఖైదీ నంబర్ 150 తర్వాత చిరు తో కాజల్ కి ఇది రెండో ఆఫర్. ఇక పూజాహెగ్డే కు చరణ్ సరనన తొలి ఆఫర్ కావడంతో దానిని వదులుకునేందుకు సిద్ధంగా లేదట. పూజా ఇందులో చిన్న పాత్రలో అయినా నటించేందుకు 18 రోజుల వరకూ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుందిట. ఇక మెగా ఆఫర్ ని కాదనుకుంటే జరిగే నష్టంపైనా పూజాకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఇది వదులుకోదనే భావిస్తున్నారు. ఆచార్య ఈ వేసవిలోనే రిలీజవుతోంది. రాధేశ్యామ్- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లోనూ పూజా నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించేందుకు కాల్షీట్లు ఇచ్చింది.