Begin typing your search above and press return to search.
శ్రీకారం కోసం సినిమా చరిత్రలో మొదటి సారి..!
By: Tupaki Desk | 10 March 2021 3:38 AM GMTశర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన శ్రీకారం సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. వ్యవసాయం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కు ఉన్నట్లుండి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొన్ని వారాల క్రితం వరకు శ్రీకారం గురించి జనాల్లో పెద్దగా చర్చ లేదు. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా శ్రీకారం ముచ్చట్లు వినిపిస్తున్నాయి. తప్పకుండా శ్రీకారం విజయాన్ని సొంతం చేసుకుంటుంది.. చేసుకోవాలని ఆశిస్తున్నాం అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు అయిన చిరంజీవి మరియు కేటీఆర్ లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ సభ్యులు నిజంగా వ్యవసాయం చేయించినట్లుగా చెబుతున్నారు.
సినిమా కోసం దాదాపుగా 50 ఎకరాల భూమిని తీసుకుని వ్యవసాయం చేయడం జరిగింది. అందులో రకరకాల పంటలు వేసి షూటింగ్ చేశారట. కరోనా లాక్ డౌన్ కారణంగా మళ్లీ మళ్లీ పంటలు వేయడం జరిగిందట. ఈ విషయమై సీనియర్ నటుడు నరేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమా కోసం భూమిని తీసుకుని పంటలు పండించిన నిర్మాతలు ఈ ప్రపంచంలోనే లేరు ఇది వరల్డ్ రికార్డ్ అన్నారు. సినిమా చరిత్రలో మొదటి సారి సినిమా కోసం నిజంగా వ్యవసాయం చేయించడం వ్యవసాయ క్షేత్రం తీసుకుని పంటలు వేయడం నుండి పంట నూర్చడం చేయడం చేశారు. నటుడు రావు రమేష్ సైతం ఈ విషయం గురించి మాట్లాడుతూ 50 ఎకరాల భూమిని తీసుకుని వ్యవసాయం చేసి మరీ సినిమాను నిర్మించిన నిర్మాతలకు థ్యాంక్యూ అన్నారు.