Begin typing your search above and press return to search.

యాక్సిడెంట్ త‌ర్వాత తొలిసారిగా..!

By:  Tupaki Desk   |   23 Nov 2021 8:30 AM GMT
యాక్సిడెంట్ త‌ర్వాత తొలిసారిగా..!
X
సుప్రీంహీరో సాయి తేజ్ అనూహ్యంగా బైక్ యాక్సిడెంట్ కి గురై కోమాలోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత అత‌డు కోలుకునేందుకు రెండు నెల‌లు పైగా ప‌ట్టింది. ఇప్ప‌టికీ అత‌డు ప‌బ్లిక్ కి క‌నిపించ‌లేదు. అభిమానులు తన కోసం ఎంతో ఆత్రుత‌గా వేచి చూస్తున్నారు. త‌మ ఫేవ‌రెట్ హీరోని నేరుగా చూడాల‌ని వేచి ఉన్నారు. అయితే సాయి తేజ్ ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ ఎప్పుడు? అన్న‌ది ఇన్నాళ్లు తెలియ‌లేదు.

తాజా స‌మాచారం మేర‌కు సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఎట్టకేలకు పబ్లిక్ గా కనిపించబోతున్నాడు. రేపు (నవంబర్ 24న) హైదరాబాద్ లో జరిగే రిపబ్లిక్ OTT ప్రీమియర్ ప్ర‌క‌ట‌న స‌మావేశానికి ఆయన హాజరుకానున్నారు. రిపబ్లిక్ టీమ్ మొత్తం హాజరవుతారు. జీ5 నవంబర్ 25 నుండి రిపబ్లిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమాదం కార‌ణంగా అప్ప‌ట్లో హీరో సినిమా ప్రమోషన్లకు రాలేని ప‌రిస్థితి తెలిసిందే.

రెండున్న‌ర‌ నెల‌లకు కానీ అత‌డు కోలుకోలేదు. ఇప్ప‌టికి పూర్తిగా కుదుట‌ప‌డింది. ఇటీవ‌ల హ‌రీష్ శంక‌ర్ సైతం సాయి తేజ్ ఆరోగ్యంపై స‌ర్టిఫై చేశారు. ఇక‌పోతే అత‌డి త‌దుప‌రి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్ట‌రీ డ్రామా కం థ్రిల్లర్ లో కనిపించనున్నాడు. అత్తారింటికి దారేది నిర్మాత‌ బివిఎస్ ఎన్ ప్రసాద్ - సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌రో రెండు ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. కానీ ఇవ‌న్నీ ప్ర‌క‌టించేందుకు ఇంకా చాలా స‌మ‌యం ఉందని తెలిసింది. సాయితేజ్ ఇంకా బాగా కోలుకుని మేకోవ‌ర్ ని ఫిట్నెస్ ని చూపించాల్సి ఉంటుంది.