Begin typing your search above and press return to search.

స్నేహం కోసం... చిరంజీవి కొత్త సినిమా!

By:  Tupaki Desk   |   17 Dec 2022 5:19 AM GMT
స్నేహం కోసం... చిరంజీవి కొత్త సినిమా!
X
మెగాస్టార్ చిరంజీవి 2022 సంవత్సరంలో ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2023 సంవత్సరంలో కూడా రెండు మూడు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023 సంక్రాంతికి బాబీ దర్శకత్వంలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

వచ్చే ఏడాది సమ్మర్‌ లో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా ను విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది చిరంజీవి నుండి ఈ రెండు సినిమాలు కాకుండా మరో సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం చిరంజీవి స్నేహం కోసం ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడట. ఆ సినిమానే వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట.

రాధిక మరియు చిరంజీవి సుదీర్ఘ కాల ఆప్త మిత్రులు. ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇద్దరి కాంబో అప్పట్లో హిట్ కాంబినేషన్. అలాంటి హిట్ కాంబినేషన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిపీట్‌ కాబోతుంది.

అయితే ఈసారి రాధిక మరియు చిరంజీవి జోడీగా కాకుండా... చిరంజీవి హీరోగా రాధిక నిర్మాణంలో ఒక సినిమా రూపొందబోతోంది. రాధిక సొంత బ్యానర్ రాడాన్ బ్యానర్ లో చిరంజీవి సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

రాధిక నిర్మాణంలో నటించబోతున్న చిరంజీవి పారితోషికం ముందస్తుగా తీసుకోకుండా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సమయంలో కొంత మొత్తం ను.. ఆ తర్వాత లాభాల్లో కొంత మొత్తం ను పారితోషికంగా తీసుకోబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చిరంజీవి మరియు రాధిక కాంబో సినిమా వారి స్నేహం ను మరింత ముందుకు తీసుకు వెళ్లబోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.