Begin typing your search above and press return to search.
`ఆచార్య` ప్రీ రిలీజ్ వేదిక ఏ కారణంగా మారినట్లు?
By: Tupaki Desk | 19 April 2022 9:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో సిద్ద అనే పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ మెగా అభిమానులకు బిగ్ ్రీట్ లా ఉంది. `ఆచార్య`..`సిద్ద` పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో ట్రైలర్ లో నే తెలిసిపోతుంది.
మెగా స్టార్ ఇమేజ్కి ఏమాత్రం తగ్గకుండా కొరటాల మార్క్ సెన్సిబుల్ మార్క్ తో తెరకెక్కింది. ఫస్ట్ లుక్ పోస్టర్లు అంతే క్యూరియాసిటీని రెట్టింపు చేస్తున్నాయి. అన్ని పనులు పూర్తిచేసుకుని సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 23న భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. మెగా అభిమానుల సమక్షంలో యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ అందుకు వేదిక అయినట్లు సమాచారం.
ఎలాంటి అడ్డంకులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు కూడా జారీ చేసింది. అయితే ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్లు సమాచారం. చిరంజీవి..చరణ్ ల కోరిక మేరకు పవన్ కి ఆహ్వానం అందిందిట. దీంతో పవన్ ఈ వేడుకకు తప్పక హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే నిజమైతే మెగా అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ షురూ అయినట్లే. ఒకే వేదికపై చిరంజీవి..పవన్ కళ్యాణ్...రామ్ చరణ్ లను చూసుకోవడం అంటే అభిమానులకు పెద్ద పండగే.
ముగ్గురిని ఒకే వేదికపై చూసి చాలా కాలమవుతుంది. అప్పుడెప్పుడో చిరంజీవి హీరోగా నటించిన ప్రీ రిలీజ్ వేడుక పంక్షన్ కే ముగ్గురు హాజరయ్యారు. అప్పటికే మెగా ఫ్యామిలీలో చిరు-పవన్ ల మద్య ఎవో మనస్పర్ధలున్నాయాని ప్రచారం సాగింది. ఆవే డుకకు పవన్ రావడంతో ఆ తప్పుడు ప్రచారాలకి పుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ ఈ ప్రభుత్వానికి పెద్ద విమర్శకుడు.
ఇదే ప్రభుత్వంతో చిరంజీవి ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. ఆ కారణంగానూ మళ్లీ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు తలెత్తినట్లు ప్రచారలోంకి వచ్చింది. వాటికి రేపటి `ఆచార్య` ప్రీ రిలీజ్ ఈవెంట్ పుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది. అయినా సినిమాలు వేరు..రాజకీయాలు వేరు అని అన్నదమ్ములిద్దరు ఓవైపు చెబుతూనే ఉంటారు. పార్టీల పరంగా వేరైనా..ఒకే ఫ్యామిలీ అంటారు.
వాస్తవానికి `ఆచార్య` ప్రీరిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో నిర్వహించి...ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్య అతిధిగా ఆహ్వానించాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ వేడుకని హైదరాబాద్ కి మార్చారు. పవన్ ని రంగంలోకి దించారు. మరి దీని వెనుక అసలు కథ ఏంటి? అన్నది తెలియాలి.