Begin typing your search above and press return to search.

ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాలో భానుమతి

By:  Tupaki Desk   |   6 Feb 2020 1:30 AM GMT
ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాలో భానుమతి
X
ప్రేమమ్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఫిదాతో టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోయింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మరియు మలయాళంలో కూడా ఈ అమ్మడు పెద్ద హీరోల సరసన హీరోయిన్‌ గా నటిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశంను ఒప్పుకోకుండా తనకు నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఆదాయం విషయంలో ఫోర్బ్స్‌ జాబితాలో చేరింది.

30 ఏళ్ల లోపు ఉన్న ఇండియన్‌ యూత్‌ లో అత్యధిక సంపాదన కలిగిన 30 మంది జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు ప్రముఖ కంపెనీల సీఈఓలు మరియు కంపెనీ ఫౌండర్స్‌ ఉన్నారు. ఇండియన్‌ సినీ పరిశ్రమ నుండి ఈ జాబితాలో చోటు దక్కించుకుంది ఈమె ఒక్కరే. యూట్యూబర్స్‌ కు కూడా ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం.

సాయి పల్లవి ఈ జాబితా లో 15వ స్థానం దక్కింది. ఈమె సినిమాలు సెలెక్టెడ్‌ గా చేసి తక్కువ సినిమాలు చేసినా కూడా ఎక్కువ పారితోషికంను ఈమె అందుకుంటుందట. అందుకే ఈ జాబితాలో నిలిచినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె రానాతో కలిసి ఒక చిత్రం.. నాగచైతన్యతో కలిసి లవ్‌ స్టోరీ చిత్రాలతో పాటు ఇంకా తెలుగులోనే పలు చిత్రాలు ఇంకా తమిళం మరియు మలయాళం లో ఈ అమ్మడు నటిస్తూ ఉంది.

ఏడాదిలో ఈ అమ్మడి ఆదాయం దాదాపుగా 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈమె కంటే ఎక్కువ సంపాదించే హీరోయిన్స్‌ ఉన్నారు కాని వారు 30 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వారు అవ్వడంతో వారికి ఈ జాబితాలో చోటు దక్కలేదు.