Begin typing your search above and press return to search.
వావ్.. ‘ఊపిరి’కి ఫోర్బ్స్ కాంప్లిమెంట్స్
By: Tupaki Desk | 28 March 2016 10:28 AM GMTఒకప్పుడు అమెరికాలో తెలుగు సినిమా రిలీజవడమే గొప్ప అన్నట్లుండేది. కానీ ఇప్పుడు ఓవర్సీస్ అన్నది తెలుగు సినిమాకు చాలా పెద్ద మార్కెట్లలో ఒకటిగా మారింది. బాహుబలి సినిమా అక్కడ దాదాపు రూ.50 కోట్ల దాకా వసూలు చేసి తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించింది. హాలీవుడ్ సినిమాల నిర్మాతలు సైతం ఏంటీ బాహుబలి అని చూసేలా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది ‘బాహుబలి’. కొన్ని వారాల పాటు హాలీవుడ్ బాక్సాఫీస్ లో టాప్-10 జాబితాలో కనిపించి సంచలనం రేపింది బాహుబలి. మళ్లీ ఇప్పుడు ‘ఊపిరి’ అదే స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. ఈ సినిమా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ.. 11వ స్థానంలో నిలిచి.. ట్రేడ్ పండిట్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది.
తొలి వారాంతంలోనే 9.1 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘ఊపిరి’పై ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ స్పెషల్ ఆర్టికల్ ప్రచురించడం విశేషం. ‘‘ఇండియన్ క్రిటిక్స్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మాతృతకు ఇది ఫెయిత్ ఫుల్ రీమేక్ అని.. అలాగే దీనికంటూ ఓ ప్రత్యేకతను చాటుకుందని ప్రశంసలు దక్కించుకున్న ‘ఊపిరి’ యుఎస్ లో 163 స్క్రీన్లలో ప్రదర్శితమవుతూ 9.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. యుఎస్ బాక్సాఫీస్ టాప్-10కు కొద్దిగా అవతల 11వ స్థానంలో నిలిచింది’’ అని ఫోర్బ్ పేర్కొంది. ‘ఊపిరి’.. హాలీవుడ్ మూవీ ‘బ్యాట్ మ్యాన్ వెర్సస్ సూపర్ మ్యాన్’తో పాటు హిందీ సినిమా ‘రాకీ హ్యాండ్సమ్’కు సైతం గట్టి పోటీ ఇస్తోందని ‘ఫోర్బ్స్’ పేర్కొనడం విశేషం.