Begin typing your search above and press return to search.
రెండో ఘర్షణలో 'అతడు' సీన్ దిగిందే
By: Tupaki Desk | 30 Sep 2016 4:33 AM GMTఇప్పుడు బాలీవుడ్డులో మరో యాక్షన్ సినిమాతో ధమాకా ఎంటర్టయిన్మెంట్ అందించాలని చూస్తున్నాడు హీరో జాన్ అబ్రహాం. ఆడియన్స్ ఎన్నిసార్లు రిజక్ట్ చేసినా కూడా మనోడు ఏదో యాక్షన్ సినిమాతో వచ్చి.. అందులో షర్టు లేకుండా తన కండలతో గ్లామర్ ఆరబోసి.. హిట్టు కొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ క్రమంలో గతంలో తెలుగు 'ఘర్షణ' సినిమాను 'ఫోర్స్' అంటూ రీమేక్ చేసిన ఈ హీరో.. ఇప్పుడు 'ఫోర్స్ 2'తో వచ్చాడు.
గత రాత్రి విడుదల చేసిన ఫోర్స్ 2 ట్రైలర్ చూస్తే.. అసలు జాన్ చేసిన ఏ సినిమా అనేది కూడా చెప్పలేనంత కష్టంగా ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన డిష్యూం.. రాకీ హ్యాండ్సమ్.. ఇలాంటి సినిమాలన్నింటి ట్రైలర్లు కూడా ఫోర్స్ 2 తరహాలోనే ఉండటమే అందుకు కారణం. సినిమాలో జాన్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంటే. రా ఏజెంటుగా సోనాక్షి సిన్హా కనిపిస్తోంది. ఆమె సైజుకు యాక్షన్ పార్టు అస్సలు సూట్ కాలేదు. ఇక సౌత్ పీపుల్ కు ఈ ట్రైలర్లో స్పెషల్ గా దేనికి కనక్ట్ అవుతారంటే.. ఖచ్చితంగా 'అతడు' సినిమాలో మహేష్ బాబు చేసే ఫస్ట్ మర్డర్ సీన్ ఉంది చూశారూ.. అదేనండీ బిజీగా ఉన్న మార్కెట్లో పొట్టలో చాకు దింపేసి చాకచక్యంగా ఎస్కేప్ అవుతాడే.. ఆ సీన్ కు బాగా కనక్ట్ అవుతారు.
ఢిల్లీ బెల్లి వంటి కత్తిలాంటి సినిమాను తీసిన అభినయ్ డియో.. తరువాత గేమ్ అనే అట్టర్ ఫ్లాప్ తీసి ఇప్పుడు ఫోర్స్ 2 అంటున్నాడు. ఈసారైనా మరి హిట్టు కొడతాడో లేదో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/