Begin typing your search above and press return to search.
మోస్ట్ వెయింటింగ్ మూవీపై విదేశి సంస్థ కేసు నమోదు
By: Tupaki Desk | 10 Dec 2021 11:30 AM GMTఇండియాకు మొదటి ప్రపంచ కప్ ను తీసుకు వచ్చి.. ఇండియాలో క్రికెట్ కు ఇంతటి ప్రాచుర్యం దక్కేలా చేసిన వ్యక్తి కపిల్ దేవ్ అనడంలో సందేహం లేదు. ఆయన 1983 లో ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ కప్ టోర్నీలో అడుగు పెట్టి అద్బుత విజయాలను దక్కించుకుని అనూహ్యంగా ఫైనల్ లో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
టీం ఇండియా కు ఆ సమయంలో దక్కిన విజయం ఇండియన్ క్రీడా చరిత్రలో ఎప్పటికి మర్చి పోలేని రోజు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో క్రికెట్ ను ఆధరించడం అభిమానించడం అప్పటి నుండే మొదలు అయ్యింది. ఆ సంఘటనలు మళ్లీ మన కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు గాను బాలీవుడ్ లో '83' సినిమా రూపొందింది. ఆ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది.
డిసెంబర్ 24న భారీ ఎత్తున దేశ వ్యాప్తంగా విడుదల కాబోతున్న '83' సినిమా పై కేసు నమోదు అయ్యింది. చిత్ర నిర్మాతలు తమను మోసం చేశారంటూ యూఎఈ ఫైనాన్షియర్ సంస్థ ఒకటి అంధేరి మెట్రోపాలిటెన్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. సంస్థ తో నిర్మాతలు ఒప్పందం చేసుకుని పంపిణీ హక్కులు ఇచ్చేందుకు అంగీకరించారట.
అందుకు గాను 15.90 కోట్ల రూపాయలను వసూళ్లు చేయడం జరిగిందట. కాని సినిమా విడుదల సమయంలో తమకు సమాచారం ఇవ్వకుండా సినిమాను మరొకరికి అప్పగించారని ఇది ఖచ్చితంగా చీటింగ్ అని.. 83 సినిమా నిర్మాతలు చీటింగ్ కు పాల్పడ్డారంటూ యూఎస్ సంస్థ వారు కోర్టులో వాదిస్తున్నారు. కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించడంతో విడుదల వాయిదా పడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
83 సినిమా చిత్రం డిస్ట్రిబ్యూషన్ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ కోర్టును ఆశ్రయించిన సంస్థ ప్రతినిధులు రాజీకి ఒప్పుకుంటారా అనేది చూడాలి. రణవీర్ సింగ్ మరియు దీపిక పదుకునే జంటగా నటించిన ఈ సినిమా క్రికెట్ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతాయని అంటున్నారు. అప్పట్లో టీవీలు లేకపోవడంతో కనీసం లైవ్ వాయిస్ కూడా ఇవ్వలేదు.
ఆ మ్యాచ్ ను చూడలేక పోయిన ఇండియన్స్ కు ఖచ్చితంగా 83 ఒక వరం అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా 83 సినిమా కోసం వెయిట్ చేస్తున్న సమయంలో కేసు లు.. ఫిర్యాదులు సినిమా విడుదల విషయంలో ప్రభావం చూపించేనేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.