Begin typing your search above and press return to search.
`ఆదిపురుష్ 3డి` సీజీ కోసం విదేశీ నిపుణులు
By: Tupaki Desk | 11 Oct 2021 2:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెలుగు..హిందీలో ఓంరౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్ -3డి` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా...కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నిసింగ్ నటిస్తున్నారు. ఇక రామాయాణంలో మరో అత్యంత కీలక పాత్ర అయిన రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖ్ నటిస్తున్నారు. ఇలా దిగ్గజ నటులతో ఆదిపురుష్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. చాలా భాగం షూటింగ్ ఇండియాలోనే వివిధ ప్రాంతాల్లో జరిగింది. ఎక్కువగా ముంబై..హైదరాబాద్ లోనే సెట్లు వేసి తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో చాలా భాగంగా షూటింగ్ పూర్తయింది.
ఇప్పటివరకూ 85 రోజుల పాటు షూటింగ్ చేసారు. దీంతో చిత్రీకరణ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. అక్టోబర్ నెలఖారకు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ఇటీవలే రావణుడి పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీఖాన్ పాత్ర చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సమక్షంలో కేక్ కట్ చేసి సైఫ్ కి బైబై రావణా అంటు విడ్కోలు పలికారు. దానికి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుని సైఫ్ తో చోటు చేసుకున్న సరదా సన్నివేశాల్ని నటీనటులు పంచుకున్నారు. ఇక సినిమా షూటింగ్ వేగంగా పూర్తయిన సీజీ వర్క్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
పైగా 3డీ మూవీ కాబట్టి టెక్నికల్ వర్క్ పై ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా దేశవిదేశాల్లో సీజీకి సంబంధించిన పనులను వివిధ కంపెనీలకు అప్పగించినట్లు సమాచారం. అవతార్ నిపుణులు పని చేయనున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. ఇక ఈ చిత్రాన్ని అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కి బాలీవుడ్ లో ఇదే తొలి చిత్రం అన్న సంగతి విధితమే.