Begin typing your search above and press return to search.
ఫారెన్ షూటింగ్స్ బంద్.. చేయించిన కరోనా..
By: Tupaki Desk | 16 April 2020 1:30 AM GMTఈ కాలంలో సినిమాలంటే ఖచ్చితంగా వేరే దేశానికి వెళ్లి షూటింగ్స్ చేస్తున్నారు. కొంత భాగం విదేశాల్లోనే కథను రన్ చేస్తారు. కథ ఇక్కడిదైనా పాటలు అక్కడ చిత్రిస్తారు. ఈ రోజుల్లో కథ అవసరం రీత్యా విదేశాలకు వెళ్లడం తక్కువ బిల్డప్ కోసం ఎక్కువ వెళ్తున్నారు. ఫారిన్ షెడ్యూల్‌ను హీరోలు ఒక వెకేషన్ లాగా భావిస్తారు. ముఖ్యంగా వేసవిలో షూటింగ్ అంటే ఏదో ఒక చల్లని దేశానికి వెళ్లాల్సిందే. స్టార్ హీరోల సినిమాలంటే ఇండియాలో ఎక్కడ కూడా చల్లని ప్రదేశాలు దొరకడం కష్టం కాబట్టి దర్శక నిర్మాతలు సైతం ఫారిన్ షెడ్యూల్ అయితేనే బెటర్ అనుకునే పరిస్థితి నెలకొంది. తాజాగా కరోనా పుణ్యమా అని ఈ ఫారెన్ ఆలోచన అంతా మారిపోతోంది. ఈ ఏడాది ఏ చిత్ర బృందం కూడా విదేశాలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. కరోనా మహమ్మారి ప్రమాదకరంగా మారుతున్న దశలోనే ప్రభాస్ కొత్త సినిమా టీం యూరప్ వెళ్లి ఓ షెడ్యూల్ చేసుకొచ్చింది. వెళ్లడమైతే వెళ్లారు కానీ.. అక్కడ పరిస్థితులు చూశాక ఈ చిత్ర బృందం భయపడిందట.
చాలా ఇండియన్ సినిమాలు షెడ్యూల్ త్వరగా పూర్తి చేసుకొని ఇళ్లకు చేరిన విషయం తెలిసిందే. కథ రీత్యా ఇంకా కొన్ని సన్నివేశాలు ఫారెన్ లో తీయాల్సి ఉన్నా ఇక్కడే సెట్లతో మేనేజ్ చేసుకోవాల్సిందే. ఇక విదేశానికి వెళ్లకుండానే సినిమాలను ముగించాలని భావిస్తున్నారట. కరోనా ప్రభావం ఈ ఏడాదంతా కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో తెలుగు సినిమాలన్ని ప్లానింగ్స్ మార్చుకుంటున్నారట. విదేశాల కోసం రాసిన సీన్లు అన్నీ మార్చేస్తున్నారని వినికిడి. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తీస్తున్న సినిమాలోనూ కీలక సన్నివేశాల్ని అమెరికా జార్జియా దేశాల్లో షూట్ చేయాల్సి ఉండగా ఆ ఆలోచన మార్చుకొని సెట్స్ వేసి పనిలో పడ్డట్లు సమాచారం. మొత్తానికి కరోనా తెలుగు సినిమాల షూటింగును ఫారెన్ కి వెళ్లకుండా చేసేసిందని కొందరు వాపోతుంటే.. మరి కొందరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.