Begin typing your search above and press return to search.

#ఫోరెన్సిక్ రీటెస్ట్‌: సుశాంత్ పై విష ప్ర‌యోగం జ‌రిగిందా?

By:  Tupaki Desk   |   20 Sep 2020 8:52 AM GMT
#ఫోరెన్సిక్ రీటెస్ట్‌: సుశాంత్ పై విష ప్ర‌యోగం జ‌రిగిందా?
X
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి దారితీసిన పరిస్థితులను పున పరిశీలించడానికి ముంబై వెళ్లిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ బృందం సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ను కలుసుకుని తన నివేదికను సమర్పించ‌నుంది. ఆదివారం నాడు శవపరీక్ష ఫైళ్ళపై మెడికల్-లీగల్ అభిప్రాయం కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఎయిమ్స్ ను సంప్రదించింది.

సుశాంత్ పై విష ప్ర‌యోగం జ‌రిగిందా? అన్న కోణాన్ని ఆరా తీసే ప్ర‌య‌త్న‌మే ఇద‌ని తెలుస్తోంది. డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని ఫోరెన్సిక్ బృందం విషప్ర‌యోగానికి సంబంధించిన‌ అవకాశాన్ని తనిఖీ చేయడానికి విసెరా పరీక్ష‌ ను నిర్వహించింది. విసెరా టెస్ట్ అంటే శ‌రీర అంత‌ర్భాగాల్లో పాయిజ‌న్ లేదా క‌డుపులో పేర్కొన్న పాయిజ‌న్ కి సంబంధించిన ప‌రీక్ష అని తెలుస్తోంది. ఇక‌ ఈ బృందం ఈ రోజు సిట్ ను కలవనుంది. అయితే ఈ కేసు ఇంకా సీబీఐ అధీనంలో ఉన్నందున తాజా నివేదిక ఏమిటి? అన్న‌ది బహిరంగపరచే వీల్లేదని తెలుస్తోంది. ``విసెరా ప‌రీక్ష రిపోర్ట్ త‌ప్ప‌నిస‌రిగా అందిస్తాం`` అని మాత్ర‌మే డాక్టర్ గుప్తా చెప్పారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న ముంబై నివాసంలో చనిపోయాడు. ఈ మరణానికి సంబంధించి రియా అరెస్టు అనంత‌రం సమాంతరంగా మాదకద్రవ్యాల కేసులో ద‌ర్యాప్తు సాగుతోంది. ఇప్ప‌టికే అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు - రాజ్‌పుత్ సిబ్బంది.. శామ్యూల్ మిరాండా.. దీపేశ్ సావంత్ తో పాటు దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులకు కౌంట‌ర్లు దాఖలు చేయాలని బొంబాయి హైకోర్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ను ఆదేశించింది. డ్రగ్స్ పెడ్లర్ అబ్దేల్ బాసిత్ పరిహార్ కి సంబంధించిన‌ తదుపరి విచారణ సెప్టెంబర్ 29 న ఉంటుంది. ఈ విచార‌ణ‌లో చాలా విష‌యాలు నిగ్గు తేలేందుకు ఆస్కారం ఉంద‌ని ఇంకా చాలామంది సెల‌బ్రిటీల పేర్లు బ‌య‌ట‌ప‌డే ఛాన్సుంద‌ని తెలుస్తోంది.