Begin typing your search above and press return to search.
ఆది సినిమా నిర్మాతల గొడవ
By: Tupaki Desk | 2 May 2019 12:54 PM GMTఆది సాయికుమార్ హీరోగా శ్రద్దా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'ఈడు జోడు'. ఈ చిత్రంను మొదట యు అనురాధ ప్రారంభించారు. ఉప్పలపాటి సత్యనారాయణ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మాణం జరిగింది. షూటింగ్ ముగింపు దశకు వచ్చిన సమయంలో డబ్బింగ్ రైట్స్ - పంపిణీ రైట్స్ అమ్మకం మొదలు పెట్టిన సమయంలో అనురాధకు గుర్రం విజయలక్ష్మి మరియు విశ్వనాధ్ లు సినిమాలో భాగస్వామ్యం తీసుకునేందుకు ముందుకు వచ్చారట. సినిమాకు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తామని చెప్పి అనురాధ వద్ద సినిమా భాగస్వామ్యం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా అనురాధ బిజీగా ఉండటంతో సినిమా విషయాల్లో దృష్టి పెట్టలేక పోయిందట. దాంతో విజయలక్ష్మి మరియు విశ్వనాద్ లు సినిమా విడుదలకు సిద్దం చేశారట.
నిర్మాణ సంస్థ పేరు మార్చడంతో పాటు, తమతో పాటు కొత్త నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుని సినిమా విడుదలకు పోస్టర్స్ కూడా సిద్దం చేయించారని, దాంతో తాను మోసపోయినట్లుగా గుర్తించాను అంటూ అనురాధ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కె రమణారెడ్డి అనే ఫైనాన్షియర్ ఈ చిత్రంకు ఫైనాన్స్ చేశాడు. ఆ ఫైనాన్షియర్ విజయలక్ష్మి మరియు విశ్వనాధ్ లకు మద్దతుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో సినిమా ఇప్పుడు వారి చేతిలోకి పోయిందని, తాను మొదలు పెట్టిన సినిమాను పూర్తిగా వారు హ్యాండోవర్ చేసుకున్నారని అనురాధ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసు నేపథ్యంలో సినిమా విడుదల ఇప్పట్లో ఉండదని సినీ వర్గాల వారు అంటున్నారు.