Begin typing your search above and press return to search.

మ‌మ్మ‌ల్ని మ‌న్నించండిః సింగ‌ర్ సునీత

By:  Tupaki Desk   |   28 March 2021 3:30 PM GMT
మ‌మ్మ‌ల్ని మ‌న్నించండిః  సింగ‌ర్ సునీత
X
సింగ‌ర్ సునీత ఇప్పుడు ఎలా స్పందించినా.. అది పెద్ద వార్తే అవుతోంది. గ‌త డిసెంబ‌ర్ ముందు వ‌ర‌కు కేవ‌లం సినీ, సంగీత అభిమానుల‌కు మాత్ర‌మే ప‌రిచయం ఉన్న ఆమె.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అంద‌రికీ దాదాపు సుప‌రిచితులు అయిపోయారు. రామ్ వీర‌ప‌నేనితో రెండో పెళ్లి ఎంత చ‌ర్చ‌కు దారితీసిందో తెలిసిందే. కొంద‌రు ఆమెను స‌పోర్టు చేస్తే.. మ‌రికొంద‌రు వ్య‌తిరేకించారు.

అయిన‌ప్ప‌టికీ.. ఇవేవీ ప‌ట్టించుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. గ‌త నెల‌లో సుదీర్ఘ‌ హ‌నీమూన్ కు వెళ్లి, ఫుల్లుగా ఎంజాయ్ చేసి వ‌చ్చారు. అయితే.. తాజాగా ఆమె చేసిన ప‌నికి అభిమానుల‌కు సారీ చెప్పారు.

హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో మ్యూజికల్‌ నైట్ ఏర్పాటుకు అన్నీ సిద్ధం చేశారు. ఇందులో సునీత‌తోపాటు, గీతామాధురి త‌దిత‌రులు గీతాలు ఆల‌పించేందుకు రెడీ అయ్యారు. అయితే.. నిన్న‌ శ‌నివారం జ‌ర‌గాల్సిన ఈ కార్య‌క్ర‌మం క‌రోనా కార‌ణంగా ర‌ద్దైపోయింది.

ఈ కార్య‌క్ర‌మం ర‌ద్దుకావ‌డంతో నిరుత్సాహానికి గురైన అభిమానుల‌కు సునీత సారీ చెప్పారు. క‌రోనా వ‌ల్లే ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌లేద‌ని, అంద‌రూ క్ష‌మించాల‌ని కోరింది. అంద‌రూ సుర‌క్షితంగా ఉండాల‌ని కోరుతూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు సునీత‌.