Begin typing your search above and press return to search.

మాజీ పోర్న్ స్టార్ ను చంపేస్తారట

By:  Tupaki Desk   |   5 Sept 2017 10:20 PM IST
మాజీ పోర్న్ స్టార్ ను చంపేస్తారట
X
మియా ఖలీఫా అంటే కామన్ ఆడియన్స్ కు పెద్దగా టచ్ లేకపోవచ్చు కానీ.. ఓ టైపు సినిమాలను తెగ చూసేసి.. అందులో నటులను తెగ ఆరాధించేసే జనాలు కొందరు ఉంటారు. వారికి పోర్న్ స్టార్ గా మియా ఖలీఫా బాగానే తెలుసు. లెబనీస్-అమరికన్ అయిన ఈ మాజీ పోర్న్ స్టార్ కు.. ఇప్పుడు చంపేస్తామనే బెదిరింపులు వస్తున్నాయి.

శృంగార దేవతను.. అందాల భామను చంపేస్తామన్న వాళ్లు ఎవరా అనే కదా డౌట్.. ఆ ప్రశ్నకు కూడా మియానే సమాధానం ఇచ్చింది. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తనకు వచ్చిన బెదిరింపులను వివరించింది మియా ఖలీఫా. ఉగ్రవాద సంస్థగా ప్రపంచాన్నే వణికిస్తున్న ISIS నుంచి తనకు ఈ తరహా హెచ్చరికలు వచ్చినట్లు వాపోయింది ఈ సుందరి. ఏకంగా ఈమె తలను తెగ్గొడతామంటూ బెదిరింపులు వచ్చాయట. అంతే కాదు.. సోషల్ మీడియా ద్వారా కొన్ని భయానక బీభత్సమైన ఫోటోలను కూడా పంపిస్తున్నారట ఐఎస్ ఉగ్రవాదులు.

అయితే ఈ బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కునేందుకు ఫిక్స్ అయినట్లు చెబుతున్న మియా ఖలీఫా.. అంతర్లీనంగా భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. "బలహీనతను బయట పెట్టుకోకూడదు. వాళ్లు అందుకోసమే చూస్తున్నారు. దీన్ని పక్కకు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నా. కానీ కొంతకాలం తర్వాత అయినా ఇదే జరగచ్చేమో" అంటోంది మియా ఖలీఫా. ఆమె ఫోటోకే తల నరికేసినట్లుగా మార్ఫింగ్ చేసి.. ఫోటోలు షేర్ చేస్తుండడంతోనే మియా ఖలీఫా ఇంతటి ఆందోళనకు గురి కావడానికి కారణం.