Begin typing your search above and press return to search.
డ్రగ్ కేసు: దీపికా పదుకొనే మాజీ మేనేజర్ కు ముందస్తు బెయిల్ నిరాకరణ..!
By: Tupaki Desk | 6 Aug 2021 10:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మాజీ మేనేజర్ కరిష్మా ప్రకాశ్ కు ముంబై కోర్టు ముందస్తు అరెస్టు బెయిల్ నిరాకరించినట్లు తెలుస్తోంది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తో పాటు కరిష్మా ప్రకాష్ కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారుల విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేస్తారనే భయంతో కరిష్మా గతేడాది అక్టోబర్ లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ (ఎన్‌డిపిఎస్) కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసింది.
అయితే కరిష్మా ముందస్తు బెయిల్ పై డిఫెన్స్ మరియు ప్రాసిక్యూషన్ వాదనలు విన్న ముంబై కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి వివి విద్వాన్స్.. ఆ పిటిషన్ ను తిరస్కరించారు. అయితే 2021 ఆగస్టు 25 వరకు తన ఉత్తర్వుపై స్టే విధించిన స్పెషల్ కోర్ట్.. ఈ విషయంలో బాంబే హైకోర్టును ఆశ్రయించడానికి కరిష్మా ప్రకాష్ కు అనుమతించింది. కాగా, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తరపున వర్క్ చేసిన కరిష్మా ప్రకాష్.. దీపికా పడుకునే కు మేనేజర్ గా వ్యవరిస్తూ వచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ శృతి మోడీ కూడా అదే సంస్థలో పనిచేశారు. అయితే కరిష్మా క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు రాజీనామా చేసిన తర్వాత దీపికాతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.
ఇకపోతే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసుని సీబీఐ విచారిస్తున్న క్రమంలో అనూహ్యంగా డ్రగ్స్ కోణం బయటకు వచ్చింది. దీంతో ఈ కేసుపై ఫోకస్ పెట్టిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో.. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ రియా చక్రవర్తి ని అరెస్ట్ చేయడంతో పాటు క్వాన్ టాలెంట్ సంస్థ మేనేజర్స్ ని విచారించింది. ఈ క్రమంలో 2017 అక్టోబర్ లో దీపికా తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ మరియు టాలెంట్ మేనేజర్ జయ సాహా లతో వాట్సాప్ ఛాట్ లో 'మాల్' 'హ్యాష్' 'వీడ్' గురించి డిస్కస్ చేసినట్లు బయటపడటంతో ఎన్సీబీ వారికి సమన్లు జారీ చేసింది.
అయితే కోడ్ భాషలో 'మాల్' అంటే సిగరెట్స్ అని.. 'హ్యాష్' అంటే స్లిమ్ సిగరెట్స్ అని.. 'వీడ్' అంటే మందపాటి సిగరెట్స్ అని వారు సమాధానం చెప్పినట్లుగా అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముంబై వెర్సోవాలోని కరిష్మా ప్రకాష్ నివాసంలో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించగా.. 1.7 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యాలు మరియు రెండు సీసాల సీబీడీ ఆయిల్ లభించినట్లు ఎన్సీబీ వర్గాలు వెల్లడించారు. అప్పటి నుంచి బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దీపికా మాజీ మేనేజర్ విచారణ ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ ను ముంబై కోర్టు తిరస్కరించింది.